కొత్తగా ఇళయదళపతి పులి చిత్రం

30 Jul, 2015 03:23 IST|Sakshi

 ఇళయదళపతి విజయ్ నటించిన చిత్రాలన్నింటి కంటే పులి కొత్తగా ఉంటుందని ఆ చిత్ర నిర్మాత పి.టి.సెల్వకుమార్ అన్నారు. ఎస్.కె.స్టూడియో పతాకంపై ఈయన నిర్మిస్తున్న అత్యంత భారీ చిత్రం పులి. విజయ్ సరసన హన్సిక, శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అతిలోక సుందరి శ్రీదేవి ముఖ్యపాత్ర రాణిగా నటిస్తున్నారు. కన్నడ ప్రముఖ హీరో సుదీప్ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతల్ని శింబుదేవన్ నిర్వహిస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న పులికి సంగీత బాణీలను దేవిశ్రీ ప్రసాద్ అందించారు.
 
 చిత్ర ఆడి యో ఆవిష్కరణ కార్యక్రమాన్ని వచ్చే నెల రెం డవ తారీఖున మహాబలిపురంలో భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు బుధవారం చెన్నైలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర యూ నిట్ వెల్లడించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మా త, పి.టి.సెల్వకుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం బ్రహ్మాండం అని చెప్పుకుంటున్న ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న చిత్రంతో తమ పులి చిత్రాన్ని పోల్చంగాని విజయ్ ఇప్పటి వరకు నటించిన చిత్రాలన్నింటికంటే కొత్తగా, భారీగా పులి చిత్రం ఉంటుందన్నారు. విజయ్, శ్రీదేవి, శ్రుతిహాసన్, హన్సిక, సుదీప్ అంటూ భారీ తారాగణం, ప్రఖ్యాత సాంకేతిక వర్గం పని చేస్తున్న చిత్రం పులి అన్నారు. దేవిశ్రీప్రసాద్ అద్భుతంగా సంగీత బాణీలు అందించారన్నారు. చిత్రంలో ఆరు పాటలు ఉన్నాయని తెలిపారు.
 
 ఫాంటసీ అడ్వెంచర్: ఇంతకుముందు చెప్పినట్లుగా పులి ఫాంటసీ అడ్వెంచర్ యాక్షన్ ఎంట ర్‌టైనర్ అని దర్శకుడు శింబుదేవన్ తెలిపారు. ఇది రాజారాణిల ఇతివృత్తంతో సాగే కుటుంబ సమేతంగా చూసే జనరంజక కథా చిత్రం అని చెప్పారు. కథ విన్నప్పుడే ఇన్‌స్పైర్ అయ్యా: దర్శకుడు శింబుదేవన్ కథ చెప్పినప్పుడే ఇన్‌స్పైర్ అ య్యానని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అ న్నారు. చిత్రంలో చోటు చేసుకున్న ఏండీ ఏండీ లాంటి టీజింగ్ సాంగ్ చేయాలని చాలాకాలం గా ఆశించానన్నారు. అది పులి చిత్రంతో నెరవేరిందన్నారు. తెలుగులో మహేశ్‌బాబు నటిం చిన శ్రీమంతుడు, తమిళంలో విజయ్ చిత్రం పులి ఒకేసారి చేయడం సంతోషంగా ఉందని దేవిశ్రీప్రసాద్ అన్నారు. చిత్రాన్ని సెప్టెంబర్ లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు.
 

>
మరిన్ని వార్తలు