గిరిజనుల పక్షాన పోరాడితే అక్రమ కేసులా?

8 Feb, 2017 16:13 IST|Sakshi
గిరిజనుల పక్షాన పోరాడితే అక్రమ కేసులా?
తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల పక్షమా?
పెట్టుబడిదారుల పక్షమా?
పోలీసులు తెలుగుదేశం కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు
కావాలనే వైఎస్సార్‌సీపీ నాయకులపై కేసులు నమోదుచేస్తున్నారు..  
బోడికొండ, బడిదేవర కొండ తవ్వకాల
అనుమతులు రద్దుచేసేవరకు పోరాడతాం
వైఎస్సాసీపీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్‌
 
పార్వతీపురం టౌన్‌: గిరిజనుల పక్షాన పోరాడేవారిపై అక్రమ కేసులు బనాయించడం తగదని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్‌ అన్నారు. గుండెనొప్పితో బాధపడుతూ పార్వతీపురం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్‌సీపీ పార్వతీపురం నియోజకవర్గం సమన్వయకర్త జమ్మాన ప్రసన్నకుమార్‌ను మంగళవారం పరామర్శించారు. ఆస్పత్రి సూపరిం టెండెంట్‌ జి.నాగభూషణరావుతో మాట్లాడి ప్రసన్నకుమార్‌ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బెల్లాన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల పక్షమా లేక పెట్టుబడిదారుల పక్షమా చెప్పాలడి డిమాండ్‌ చేశారు. గిరిజనుల పొట్టకొట్టేలా బోడికొండ, దేవరకొండలపై గ్రానైట్‌ తవ్వకాలకు అనుమతులివ్వడం విచారకరమన్నారు. కొండలు కనుమరుగైతే భూములకు సాగునీరు అందదని గిరిజనులు తిరగబడ్డారన్నారు. వారికి మద్దతిచ్చిన వైఎస్సార్‌ సీపీ, వామపక్షాల నాయకులపై కేసులు పెట్టడం తగదన్నారు. పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పోలీç Üులు ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, అవసరమైతే జిల్లా, రాష్ట్ర నాయకత్వం బోడికొండ, బడిదేవర కొండవద్దకు వచ్చి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. ఒక చిన్న సంఘటనలో అరెస్టుచేసిన వ్యక్తిని రెండు రోజుల పాటు ఎక్కడ దాచారో తెలపకుండా కనీసం ఆహారం కూడా పెట్టకుండా పోలీసులు హింసిస్తుండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రజాప్రతినిధులను ఉగ్రవాదుల్లా అర్ధరాత్రి వేల అడవుల్లో తిప్పడం ఏమటని ప్రశ్నించారు. పాలకులు కాంట్రాక్టర్లకు  కొమ్ముకాస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తుండడం విచారకరమన్నారు. బోడికొండ, బడిదేవర కొండల తవ్వకాల అనుమతులు రద్దు చేసే వరకు పోరాడతామని స్పష్టం చేశారు.
 
 ఆయన వెంట వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్‌ నాయకులు గర్భాపు ఉదయభాను, జిల్లా నాయకులు చుక్క లకు‡్ష్మనాయడు, చింతల జగన్నాథం, తీళ్ల శువిన్నాయుడు, ఎస్‌.వీ.ఎస్‌.ఎన్‌.రెడ్డి, బలిజిపేట మండలం నాయకులు పాలవలస మురళీకృష్ణ, దేవుపల్లి శ్రీనివాస్, గుళ్ల రాజు, కేవీ రావు, వారణాసి కాసి, శ్రీను, సత్యనారాయణ, కౌన్సిలర్లు ఎస్‌.శ్రీనివాసరావు, ఒ.రామారావు, గొల్లు వెంకటరమణ, గండి శంకరరావులు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు