'అమరావతికి పర్యావరణ అనుమతి లేదు'

6 Oct, 2016 19:32 IST|Sakshi

విజయవాడ: పర్యావరణ అనుమతులు లేకుండా అమరావతి నిర్మాణం జరుగుతోందని సామాజిక ఉద్యమకారిణి మేధా పాట్కర్ ఆరోపించారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... సింగపూర్ కంపెనీలకు దోచిపెట్టేందుకే స్విస్ చాలెంజ్ విధానం అవలంభిస్తున్నారని విమర్శించారు. రాజధాని నిర్మాణం కోసం మూడు పంటలు పండే భూములు తీసుకోవద్దని శివరామకృష్ణన్ కమిటీ ముందే చెప్పిందని గుర్తు చేశారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో రాజధాని గ్రామాల్లో భూములను దోచుకుంటున్నారని ఆరోపించారు.

ప్రజల హక్కులను హరిస్తూ రాజధాని నిర్మాణం జరుగుతోందని దుయ్యబట్టారు. రాజ్యాంగ విరుద్ధంగా ప్రకృతిని ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. వరదొస్తే మునిగిపోయే ప్రాంతంలో  రాజధాని కడుతున్నారని తెలిపారు. చంద్రబాబు ఇంటిపక్కనే ఇసుక క్వారీల పేరుతో నదిని కొల్లగొడుతున్నారని విమర్శించారు. ఇదంతా చంద్రబాబు ఆశీస్సులతోనే జరుగుతోందన్నారు. రాజధాని ప్రాంతంలో దళితుల హక్కులను కాలరాస్తున్నారని మేధా పాట్కర్ ధ్వజమెత్తారు.   

మరిన్ని వార్తలు