సింగంతో హ్యాట్రిక్

9 Feb, 2015 01:49 IST|Sakshi
సింగంతో హ్యాట్రిక్

 సింగంతో హ్యాట్రిక్‌కు అందాల భామ అనుష్క సిద్ధం అవుతున్నారు. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మంచి జోష్‌లో ఉన్నారు. గత ఏడాది చివరిలో లింగా చిత్రం నిరాశనే మిగిల్చినా ఈ ఏడాది ప్రారంభంలోనే ఎన్నై అరిందాల్ చిత్రం హిట్ అవడంతో అనుష్క ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఇందుకు మరో కారణం ఆమె ఎంతో కష్టపడి కత్తి యుద్ధం, గుర్రపు స్వారీ లాంటి సాహోసోపేతమైన విద్యల్లో శిక్షణ పొంది నటించిన చారిత్రక కథా చిత్రం రుద్రమదేవి.
 
 త్వరలో తెరపైకి రానుంది. ఆ తరువాత అత్యంత భారీ చిత్రం ప్రపంచ సినిమా ఎదురు చూస్తున్న చిత్రం బాహుబలి విడుదలకు రెడీ అవుతోంది. ఇలా వరుసగా 2015లో తన చిత్రాలు విడుదల కానుండడంతో చాలా ఎగ్జైటింగా ఎదురు చూస్తున్నారు. అంతే కాదు మరో రెండు కొత్త చిత్రాలు అనుష్కను వరించడం ఆమెకు ఏడాది స్పెషల్ కానుంది. తమిళంలో నటుడు సూర్యతో సింగం, దానికి కొనసాగింపుగా వచ్చిన సింగం-2, చిత్రాలు ఘన విజయం సాధించి అనుష్క మార్కెట్‌ను పెంచాయి. సింగంకు మరో సీక్వెల్ అంటే సింగం-3 కు సూర్య దర్శకుడు హరి సిద్ధం అవుతున్నారు. ఈ విషయాన్ని హరి స్వయంగా వెల్లడించారు.
 
 ఇందులో సూర్య మరోసారి పవర్‌ఫుల్ పోలీసు అధికారిగా గర్జింజనున్నారని సమాచారం. సింగం, సింగం-2లో సూర్యతో రొమాన్స్ చేసిన అనుష్క మరోసారి సింగంలో డ్యూయెట్లు పాడనున్నారన్నది తాజా సమాచారం. తెలుగులో ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు కొడుకు ప్రకాష్ నిర్మించనున్న చిత్రంలో అనుష్క నటించనున్నారు. ఈమె ద్విపాత్రాభినయం చేయనున్న ఈ చిత్రం ఈ నెలలోనే ప్రారంభం కానుంది. ప్రస్తుతం అనుష్క దుబాయ్‌లో రిలాక్స్ అవుతున్నారు.  ఈ నెల మూడవ వారంలో తిరిగొచ్చి ప్రకాష్ చిత్రంలో నటించనున్నారని సమాచారం.

మరిన్ని వార్తలు