ఠాణే సీటులో ‘పాటిల్’ ఓటర్లే కీలకం

12 Apr, 2014 23:24 IST|Sakshi
ఠాణే సీటులో ‘పాటిల్’ ఓటర్లే కీలకం

 సాక్షి, ముంబై: ఠాణే లోక్‌సభ నియోజకవర్గంలో ఇంటి పేరు పాటిల్ ఉన్న ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. అయితే ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులలో మాత్రం ఒక్క పాటిల్ కూడా లేరు. ఈ నియోజకవర్గంలో సుమారు 20 లక్షల మంది ఓటర్లున్నారు. వీరిలో 53,487 మంది ఓటర్లు ఇంటి పేరు పాటిల్ ఉన్నవారున్నారు.

రెండో స్థానంలో యాదవ్ ఓటర్లు ఉన్నారు. యాదవ్‌ల సంఖ్య 50,487 మంది ఉండగా, తృతీయ స్థానంలో ఇంటిపేరు శేఖ్ ఉన్న ఓటర్లు 45,407 మంది ఉన్నారు. కాగాద  డీఎఫ్ కూటమి అభ్యర్థిగా సంజీవ్ నాయక్ (ఎన్‌సీపీ), మహా కూటమి అభ్యర్థిగా రాజన్ విచారే (శివసేన), ఎమ్మెన్నెస్ నుంచి అభిజిత్ పాన్‌సే, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సంజీవ్ సాని బరిలో ఉన్నారు.
 
38 శాతం యువత...: ఈ నియోజకవర్గ ఓటర్లలో సుమారు 38 శాతం మంది ఓటర్లు యువతే ఉన్నారు. 18 నుంచి 37 ఏళ్ల వయస్సు గల ఓటర్లు ఏకంగా ఎనిమిది లక్షల మందికిపైగా ఉన్నారు. ఈ సారి గెలుపు ఓటముల్లో యువత ఓటు కీలకం కానుందని ఆయా పార్టీల అభ్యర్థులు ఇప్పటి నుంచే వారి జపం చేస్తున్నారు.
 
కాగా ఠాణే లోక్‌సభ నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో తెలుగు ఓటర్లు పెద్ద సంఖ్యలో  ఉన్నారు. వీరంతా వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ప్రాంతం పరిధిగా పరిశీలిస్తే  కొన్ని ప్రాంతాల్లో తెలుగు ఓట్లే కీలకంగా ఉన్నాయి. ఠాణేలోని సీపీ తలావ్, లోకమాన్యనగర్, పోన్న్ ్రనంబర్ రెండు తదితర ప్రాంతాలు ఉన్నాయి. వీటితోపాటు నియోజకవర్గంలోని దాదాపు ప్రతి ప్రాంతంలో తెలుగువారు ఉన్నారు.

మరిన్ని వార్తలు