'ఎంసెట్ సహా అన్నిపరీక్షలు ఆన్లైన్లోనే'

29 Aug, 2016 13:10 IST|Sakshi
'ఎంసెట్ సహా అన్నిపరీక్షలు ఆన్లైన్లోనే'
అమరావతి: వచ్చే ఏడాది నుంచి ఎంసెట్ సహా అన్ని పరీక్షలను ఆన్లైన్లోనే నిర్వహించనున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. సోమవారం తాత్కాలిక సచివాలయంలో విద్యాశాఖ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎస్ఆర్ఎమ్ యూనివర్సిటీకి కేటాయించిన భూములపై పనరాలోచిస్తామన్నారు. యూనివర్సిటీ యాజమాన్యంపై కేసు నమోదైన మాట వాస్తవమే అని పేర్కొన్న ఆయన.. సీఎంతో చర్చించాక భూములపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలుచేస్తామని గంటా తెలిపారు.
 
ప్రత్యేక హోదా విషయంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామన్న గంటా.. చంద్రబాబుపై ఎలాంటి కేసులు లేవన్నారు. ప్రత్యేక హోదాపై పోరాడటానికి బాబు భయపడుతున్నారనడం సరికాదన్నారు. ప్రత్యేక హోదా కోసం పవన్ కళ్యాణ్ నిర్మాణాత్మకంగా పోరాడాలని గంటా సూచించారు.
 
మరిన్ని వార్తలు