ఇండియా, సౌదీ బంధం బలమైనది

30 Nov, 2013 01:38 IST|Sakshi

గవర్నర్ హెచ్‌ఆర్ భరద్వాజ్
 

బెంగళూరు, న్యూస్‌లైన్ : ఇండియా, సౌదీ అరేబియాల మధ్య బంధం ఈనాటిది కాదని, ఏడో శతాబ్దం నుంచే పెనవేసుకుని ఉందని గవర్నర్ హెచ్‌ఆర్. భరద్వాజ్ అన్నారు. నగర శివారులోని సర్జాపుర వద్ద సబిక్ ఇంటర్నేషనల్ సెంటర్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రసంగిస్తూ ఇరు దేశాల మధ్య ఏర్పడిన సాంస్కృతిక బంధం, రాజకీయ... ఆర్థిక రంగాల్లో పరస్పర సహకారానికి బాటలు వేశాయని కొనియాడారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ మక్కాలో జన్మించినా, మహాత్ముని సహచరునిగా స్వాతంత్య్ర పోరాటంలో గణనీయమైన పాత్రను పోషించారని శ్లాఘించారు.
 
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీకాంత్ జెనా, సాబిక్ సంస్థ చైర్మన్ సౌద్ బిన్ అబ్దుల్లా, వైస్ చైర్మన్ మహమ్మద్ అల్-మ్యాడి తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు