అప్పులతోనే చిన్నాభిన్నం

24 Jun, 2018 13:11 IST|Sakshi

జయనగర : వ్యాపారంలో వచ్చిన నష్టాలతోనే పారిశ్రామికవేత్త గణేశ్‌ సహనం కోల్పోయి భార్యపై తుపాకీతో కాల్పులు జరిపిన ఘటనకు సంబంధించి పోలీసులు నిందితుడిని ముమ్మరంగా విచారణ చేపడుతున్నారు. హాసన్‌ జిల్లాకు చెందిన గణేశ్‌ కాఫీ తోటలు విక్రయించి వచ్చిన డబ్బుతో కెంగేరిలో హెర్బల్‌ ఉడ్‌ ఫామ్‌ హౌస్‌ నిర్వహిస్తున్నాడు. 

ఇటీవల వ్యాపారంలో నష్టాలు ఎక్కువ కావడంతో రిసార్టు అమ్మకానికి పెట్టాడు. ఇదే సమయంలో భార్య సహాన ఆస్తి విక్రయానికి సమ్మతించకపోవడంతో తీవ్ర ఆవేశానికి లోనైన గణేశ్‌ తుపాకీతో ఆమెపై కాల్పులు జరి పాడు. తనకు హత్య చేసే ఉద్దేశ్యం లేదని, క్షణికావేశంలో జరిగిన హత్యతో పోలీసులు అరెస్ట్‌ చేస్తారనే భయంతో కారులో పారిపోతూ పిల్లలతో పాటు తాను ఆత్మహత్యకు యత్నించడంలో భాగంగా పిల్లలపై కూడా తుపాకీతో కాల్పులు జరిపినట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు.

 కాగా సహనా, గణేశ్‌లది ప్రేమ వివా హం. గురువారం ఉదయం 11.30 గంటలకు సహనాను హత్య చేసి, స్కూల్లో చదువుతున్న పిల్లలను తీసుకుని కారులో ఉడాయించాడు. పిల్లలను రాత్రంతా రిసార్టులో ఉంచుకున్నాడు. శుక్రవారం పిల్లలను కారులో తీసుకుని వెళ్లి ఓ నిర్జన ప్రదేశంలో వారిపై కాల్పులు జరిపాడు. దీంతో పిల్లలు సిద్ధార్థ (15), సాక్షి (9)లు ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  

మరిన్ని వార్తలు