యాసిడ్‌ దాడి కేసుపై విచారణ

27 Dec, 2016 02:03 IST|Sakshi

కేకేనగర్‌: వేలూరు జిల్లా తిరుపత్తూర్‌ సమీపంలోని కురిసిలా పట్టు మహిళా పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న లావణ్య 2009లో ఉద్యోగంలో చేరింది. అనంతరం  శిక్షణ పూర్తిచేసుకుని వేలూరు సాయుధదళం పోలీసుగా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె తన సొంత ఊరైన తిరుపత్తూర్‌కు బదిలీ అయ్యారు. ఇలా ఉండగా గత శుక్రవారం ఇద్దరు అగంతకులు లావణ్యపై యాసిడ్‌ దాడి జరిపిన సంఘటన తెలిసిందే. దీంతో ఆమె కుడికన్ను పూర్తిగా దెబ్బతిని చూపు కోల్పోయింది. దీనిపై ఎస్పీ పగలవన్,  ఐజీ తమిళచంద్రన్‌ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న లావణ్య వద్ద విచారణ జరిపారు. లావణ్య వద్దనున్న సెల్‌ఫోన్‌ ద్వారా సంఘటన రోజు ఆమె ఎవరితో మాట్లాడిందనే వివరాలను పోలీసులు పరిశీలించారు. అవి పోలీసుల నంబర్లుగా తెలిశాయి. ఈ నంబర్ల ద్వారా  విచారణ జరుపుతున్నారు. సంఘటన రోజు లావణ్య తనకు ఒంటరిగా ఇంటికి వెళ్లేందుకు భయంగా ఉందని, తండ్రికి ఫోన్‌ చేసి తోడు రమ్మని పిలిచినట్టు తెలుస్తోంది. దీంతో ఆమెపై దాడి జరిగే విషయం ఆమెకు ముందుగానే తెలిసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసుపై విచారణ జరుపుతున్నారు.

మరిన్ని వార్తలు