ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తనపై ఫిర్యాదు

14 Aug, 2016 18:27 IST|Sakshi

హోసూరు(బెంగళూరు): తాలూకలోని తొరపల్లి అగ్రహారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న గణిత ఉపాధ్యాయుడు శేఖర్‌ బాలికల మరుగుదొడ్లవైపు చూస్తున్నారన్న ఫిర్యాదు రావడంతో జిల్లా విద్యాశాఖ అధికారి మల్లిక శనివారం విచారణ చేపట్టారు. తొరపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 198 మంది విద్యార్థులున్నారు. పాఠశాలలో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు వేరు వేరుగా మరుగుదొడ్లను నిర్మించారు.

గణిత ఉపాధ్యాయుడు శేఖర్‌ కొద్ది రోజుల కిందట కెలమంగలం పాఠశాలకు బదిలీ చేయంచుకెళ్లారు. పాఠశాల ప్రధానోపాధ్యాయిని రాజ్యలక్ష్మి కోరిక మేరకు ఆరు నెలల క్రితం మళ్లీ శేఖర్‌ తొరపల్లి పాఠశాలకు వచ్చాడు. కొద్ది రోజులుగా శేఖర్‌ విద్యార్థినుల మరుగుదొడ్లవైపు చూస్తున్నాడని ఫిర్యాదులు రావడంతో జిల్లా విద్యాశాఖ అధికారి మల్లిక విద్యార్థులు, తల్లి దండ్రులను విచారణ చేసి శేఖర్‌ను సెలవుపై వెళ్లవలసిందిగా సూచించారు.  ఈ సందర్భంగా తొరపల్లి అగ్రహారం గ్రామంలోని పాఠశాల వద్ద పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడారు. హోసూరు సబ్‌ఇన్‌స్పెక్టర్‌ సెంధిల్‌కుమార్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు