అందాల ఆరబోతకు సిద్ధమే

10 Dec, 2014 13:44 IST|Sakshi
అందాల ఆరబోతకు సిద్ధమే

 పోరాడి గెలవడంలో ఉండే కిక్కే వేరు. అలాంటి సంతోష సాగరంలో మునిగిపోతున్నారు నటి హాశిక. అందుకు కారణం నటిగా తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇటీవల విడుదలైన 1 బాల్ 4 రన్ 1 వికెట్ చిత్రంతో ఈ ముద్దుగుమ్మ రెండు షేడ్స్ గల పాత్రను పోషించారు. నవ నటుడు వినయ్ కృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రం హారర్ థ్రిల్లర్ ఇతివృత్తంతో రూపొంది ప్రేక్షకాదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోందని ఆనంద డోలికల్లో తేలిపోతున్న హాశికతో చిన్న ఇంటర్వ్యూ.
 
  తొలిసారిగా హారర్  చిత్రంలో నటించినట్లున్నారు?
  ఈ చిత్రంలో నటించడం సరికొత్త అనుభవం. అంతేకాదు తొలి విజయాన్ని అం దించిన చిత్రం కూడా ఇదే. 1 బంతు 4 రన్ 1 వికె ట్ చిత్రంలో నాది చాలా ప్రాముఖ్యత ఉన్న పాత్ర. నవ వధువుగా, దెయ్యంగా రెండు కోణాల్లో సాగే పాత్ర.
 
  ఏ పాత్రల్లో నటించడం కష్టం అనిపించింది?
 నిజం చెప్పాలంటే రెండు పాత్రలూ కష్టం అనిపించాయి. ఎందుకంటే చిత్ర కథ ఈ పాత్రల చుట్టూనే తిరుగుతుంది. దీంతో ఈ పాత్రల్లో పోషించడం నాకు ఛాలెంజ్‌గా మారిందనే చెప్పాలి.
 
  దెయ్యం అంటే భయమా?
  దెయ్యం అంటే భయపడని వారుం టారా? నా వరకు చెప్పాలంటే దెయ్యం అంటే చాలా భయం. 1 బంతు 4 రన్ 1 వికెట్ చిత్రాన్ని తొలిసారిగా తెరపై చూసినప్పుడు చాలా భయపడ్డాను.
 
  సాధారణంగా తమిళ భాష తెలియని హీరోయిన్లతో హీరోలు నటిస్తుంటారు. మరీ చిత్రంలో తమిళం భాష తెలియని హీరోతో నటించారు. కష్టం అనిపించిందా?
  భాష తెలియని వారితో నటించడం కొంచెం కష్టమే. అలాంటప్పుడు మూడు రోజుల్లో పూర్తి కావలసిన షూటింగ్ నాలుగు రోజులు పడుతుంది.
 
  ప్రేక్షకుల స్పందన తెలుసుకోవడానికి థియేటర్లు చుట్టొచ్చారట?
  అవును. చిత్రానికి సక్సెస్ టాక్ రావడంతో ఆ సంతోషాన్ని ప్రేక్షకులతో పంచుకోవాలని వారి స్పందనను ప్రత్యక్షంగా చూడాలన్న కోరిక కలిగింది. దీంతో చెన్నైలోని ఉదయం, ఏవీఎం రాజేశ్వరి తదితర థియేటర్లను విజిట్ చేశాను. ప్రేక్షకుల ఆదరణ బాగుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నా కిది సరికొత్త అనుభవమే.
 
  గ్లామర్ గురించి మీ అభిప్రాయం?
  గ్లామర్ అనేది సినిమాలో ఒక భాగం. కథకు అవసరం అయితే అందాలారబోతకు నేనురెడీ. అయితే దేనికైనా హద్దు అంటూ ఒకటుంటుంది. టూ పీస్ లాంటి దుస్తులు ధరించే ప్రసక్తే లేదు.
 
  మీకు నచ్చిన హీరోయిన్లు?
  మాధురీ దీక్షిత్ అంటే చాలా ఇష్టం. తమిళంలో చెప్పాలంటే కాజల్ అగర్వాల్, తమన్న, హ న్సికల నటన బాగా నచ్చుతుంది. వారి నుంచి ఒక్కొక్కరిలో ఒక్కో కొత్త విషయం నేర్చుకుంటున్నాను.
 
 చిత్ర నిర్మాణం చేపట్టే ఆలోచన ఉందట?
 అవును. అలాంటి ఆలోచన ఉంది. సినిమానే అంతా అని ఈ రంగంలోకి ప్రవేశించాను. అందువలన చిత్ర నిర్మాణం చేపట్టి తద్వారా పలువురు ప్రతిభావంతులైన దర్శకులను పరిచయం చేయాలనుకుంటున్నాను.  
 
 

>
మరిన్ని వార్తలు