ఐపీఎస్‌ రూప ఫ్యాషన్‌ ఫోటో షూట్‌

14 Aug, 2018 13:18 IST|Sakshi

సాక్షి, బొమ్మనహళ్లి: ఐపీఎస్‌ అధికారిణి డిఐజీ డి.రూప పేరు వినగానే ముక్కుసూటి పోలీసు అధికారి అని, బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్‌ జైలులో జరుగుతున్న అక్రమాలను బయట పెట్టిన నిజాయతి ఐపీఎస్‌ అని గుర్తుకొస్తుంది. నిత్యం ఖాకీ యూనిఫాంలో దర్శనమిచ్చే ఆమె ఇటీవల ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ మీను సరవన్‌ డిజైన్‌ చేసిన ముదురు బ్లూ కలర్‌ ఫ్రాక్‌ను ధరించి తమ నివాసంలో చేసిన ప్యాషన్‌ షూట్‌ ఫోటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. తాను ఐపీఎస్‌నే అయినా, ప్రముఖ మోడళ్లకు తీసిపోను అన్నట్లు ఈ ఫోటో షూట్‌లో ఐపీఎస్‌ రూప సవాల్‌ చేస్తున్నట్లు కనిపిస్తారు. 


 తమ నివాసంలో తీయించుకున్న ఫ్యాషన్‌ ఫోటో షూట్‌ దృశ్యాలు

సాధారణ మహిళల కోసమే: రూప  
ఈ సందర్భంగా తన కాలేజీ రోజులను గుర్తుకు చేసుకున్నారు. మిస్‌ బెంగళూరు యునివర్సిటి కిరీటం, మిస్‌ దావణగెరె అవార్డును విద్యార్థినిగా ఉన్న రోజుల్లో గెలుచుకున్నట్లు డి.రూప తెలిపారు. ఫోటో షూట్‌పై స్పందిస్తూ ‘నేనేమి పోలీసు విధులను వదిలి ఫ్యాషన్‌ షోలకి వెళ్ళలేదు. ఒక సాధారణ మహిళ సైతం ఫ్యాషన్‌ షోలో పాల్గొని తమలో ఉన్న ప్రతిభను నిరూపించుకోవచ్చు. ఫ్యాషన్‌ మోడల్స్, సినిమా నటీమణులు మాత్రమే ఫ్యాషన్‌ షోలకు పరిమితం కాదని అందరికీ తెలియడం కోసం నేను కెమెరా ముందుకొచ్చాను’ అని చెప్పారు. ఈ సమయంలో తనతో పాటు మరికొంత మంది మహిళలు కూడా ఫోటో షూట్‌ చేయించుకున్నారని అన్నారు. కాలేజీ రోజుల్లో అందాల టైటిల్స్‌ గెలుచుకున్న విషయాలను ఎవరికీ చెప్పుకోనని అన్నారు. గడిచిన 10 నెలలుగా ఫ్యాషన్‌ డిజైనర్‌ మీను సరవన్‌ తనకు సలహాలు ఇచ్చిన తరువాత ఈ ఫోటో షూట్‌ చేశానని రూప తెలిపారు.  

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా