లోకల్ రైళ్లలో మహిళలకు భద్రత కరవు

19 Feb, 2015 22:03 IST|Sakshi

సాక్షి, ముంబై: మహిళల భద్రత విషయంలో ముంబై ఎంతో సురక్షితమైనదని పలు అధ్యయనాలు చెబుతున్నప్పటికీ లోకల్ రైళ్లలో మాత్రం వారికి భద్రత కరువైంది. ముఖ్యంగా రాత్రి వేళ్లల్లో రైళ్లలో ప్రయాణించే మహిళలపై నేరాలు శాతం పెరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. విధులు ముగించుకుని రాత్రి వేళల్లో ఇళ్లకు వెళ్లే మహిళ ప్రయాణికులు లోకల్ రైళ్లలో వేధింపులకు గురవుతున్నారు. మహిళలపై నేరాల సంఖ్య 2012తో పోలిస్తే 2014లో రెట్టింపుగా నమోదయ్యాయి. వీటిలో లైంగిక వేధింపుల కేసులు అత్యధికంగా ఉన్నాయి.

లోకల్ రైళ్లలో ఈవ్‌టీజింగ్ సంఘటనలు అనేకమని, వీటిలో చాలా వరకు పోలీసుల దృష్టికి రాకుండా పోతున్నాయని అధికారులు పేర్కొన్నారు. రాత్రి వేళల్లో మహిళా బోగీల్లో రైల్వే పోలీసులను నియమించినప్పటికీ నేరాలు పెరగడంపై రైల్వే పోలీసు కమిషనర్ రవీంద్ర సింఘల్ ఆందోళదన వ్యక్తం చేశారు. నేరాలను అదుపుచేయడం తోపాటు, తాము సురక్షితంగా ప్రయాణం చేస్తున్నామనే నమ్మకం మహిళల్లో కలిగించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు సింఘల్ చెప్పారు.

గత రెండు సంవత్సరాల కాలంలో మహిళా బోగీల్లో ప్రయాణం చేసిన 5,330 మంది పురుషులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. వీరిలో కొందరు తెలియక, మరికొందరు కావాలనే మహిలా బోగీల్లో ఎక్కినట్లు రుజువైంది. ఆకతాయిలను అరికట్టడానికి ఎప్పటికప్పుడు అనేక పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నప్పటికీ మహిళలపై నేరాల సంఖ్య మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు.

మరిన్ని వార్తలు