జయ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల

7 Oct, 2016 00:34 IST|Sakshi
జయ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిపై అపోలో అసుపత్రి గురువారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇందులో జయ ఆరోగ్యం క్రమంగా మెరుగవుతోందని, అయితే మరికొన్ని రోజులు ఆమె వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాలని తెలిపారు. ఎయిమ్స్ వైద్యులతో పాటు అపోలో బృందం ముఖ్యమంత్రికి చికిత్స అందిస్తున్నట్లు అపోలో వర్గాలు తెలిపాయి.

జయకు చికిత్స అందిస్తున్న వైద్యుల వివరాలతో పాటు పలు విషయాలను హెల్త్ బులెటిన్‌లో అపోలో వర్గాలు వెల్లడించాయి. ఆమెకు రెస్పిరేటరీ(శ్వాసక్రియ) సపోర్ట్తో పాటు.. అవసరమైన యాంటీబయాటిక్స్ అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. కార్డియాలజిస్టులు, రెస్పిరేటరీ ఫిజిషియన్స్‌తో పాటు డయబెటాలజిస్ట్‌లు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

సీఎంకు అందిస్తున్న చికిత్సపై ఎయిమ్స్‌  కు చెందిన వైద్య నిపుణుల బృందం కూడా పరీక్షించింది. అమ్మకు మెరుగైన చికిత్స నిమిత్తం ఎయిమ్స్‌  వైద్య బృందం ఈ నెల 7వ తేదీ వరకూ ఆస్పత్రిలోనే ఉండి పర్యవేక్షించనుంది. గతవారం 30న సీఎం జయకు లండన్ కు చెందిన డాక్టర్ రిచర్డ్ బాలే నేతృత్వంలో చికిత్స అందించిన సంగతి తెలిసిందే. రిచార్డ్‌ బాలే ఈ రోజు కూడా జయ ఆరోగ్యాన్ని పరీక్షించారు. ఆరోగ్యం క్రమంగా మెరుగవుతోందని, అయితే మరికొన్ని రోజులు ఆమె వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాలని రిచార్డ్‌ బాలే తెలిపారు.
 

మరిన్ని వార్తలు