పన్నీరు ప్రత్యక్షం

20 Mar, 2016 02:12 IST|Sakshi
పన్నీరు ప్రత్యక్షం

రంగంలోకి ఓపీఎస్ అమ్మ ఆజ్ఞతో ముందుకు
ప్రచారాలు, పుకార్లకు చెక్
రాష్ట్ర కార్యాలయంలో బిజీబిజీ
ఎన్నికల వ్యవహారాల పర్యవేక్షణ
మద్దతు నేతలతో మంతనాలు

అన్నాడీఎంకేలో నెలకొన్న గందరగోళానికి తెరపడింది. మంత్రుల బృందంపై అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత కన్నెర్ర చేసినట్టుగా వస్తున్న సంకేతాలు, ప్రచారాలు, పుకార్లకు చెక్ పడ్డాయి. అమ్మ ఆజ్ఞతో ఆరుగురు మంత్రులు అసెంబ్లీ ఎన్నికల వ్యవహారాల పర్యవేక్షణకు రంగంలోకి దిగారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో శనివారం అడుగు పెట్టారు. మద్దతు పార్టీల నాయకులతో మంతనాల్లో మునిగారు.

సాక్షి, చెన్నై : మళ్లీ అధికారమే లక్ష్యంగా సరికొత్త వ్యూహ రచనలతో సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు ముందుకు సాగుతున్న తరుణంలో పలువురు మంత్రుల బండారం వెలుగులోకి రావడం చర్చకు దారి తీశాయి. సీట్ల కోసం నోట్ల కట్టల్ని సీనియర్లుగా, నిత్యం అమ్మ వెంట ఉండే  మంత్రుల మద్దతు దారులు అందుకున్నట్టు వెలుగులోకి రావడం పెద్ద షాక్కే. ఇందులో పలువురు సీనియర్ల ప్రమేయం ఉన్నట్టుగా సంకేతాల తదుపరి అన్నాడీఎంకేలో పెద్ద గందరగోళం బయలు దేరిందని చెప్పవచ్చు. వారి మద్దతు దారులు ఉద్వాసనల పర్వం సాగడంతో  మంత్రులకు వ్యతిరేకంగా రోజుకో కథనం వెలువడుతున్నా, ఖండించిన వాళ్లు లేరు. దీంతో అన్నాడీఎంకేలో ఏమి జరుగుతున్నదో అన్న ఉత్కంఠ బయలు దేరింది.

సీనియర్ మంత్రులు ఓ పన్నీరు సెల్వం, నత్తం విశ్వనాథన్ పార్టీ  ఎన్నికల వ్యవహారాల్లో దూరంగా ఉండడంతో ఇక వారిపై వేటు పడ్డట్టే అన్న ప్రచారం బయలు దేరింది. ప్రతిపక్షాలు సైతం అన్నాడీఎంకేలో సాగుతున్న వ్యవహారాలపై వస్తున్న కథనాల్ని అస్త్రంగా చేసుకుని దుమ్మెత్తి పోసే పనిలో పడ్డాయి. మంత్రులకు వ్యతిరేకంగా వస్తున్న అవినీతి ఆరోపణలతో కూడిన కథనాలపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే వారి సంఖ్య పెరిగింది. ఈ వ్యవహారాలపై అన్నాడీఎంకేలో నోరు మెదిపే వారు లేరని చెప్పవచ్చు. ఈ పరిస్థితుల్లో ఏమి జరిగిందో ఏమోగానీ, సీనియర్ మంత్రుల్ని అమ్మ కరుణించినట్టున్నారు. అమ్మ ఆజ్ఞతో తెర ముందుకు ఆరుగురు మంత్రులు వచ్చారు.

 ఆరుగురు ప్రత్యక్షం
అమ్మ జయలలిత తదుపరి స్థానంలో ఉన్న సీనియర్ మంత్రి ఓ పన్నీరు సెల్వం, నత్తం విశ్వనాథన్ చాలా రోజుల తర్వాత శనివారం తెర మీదకు వచ్చారు. అమ్మ కరుణించారో ఏమోగానీ, అమ్మ ఆజ్ఞను శిరసావహించే విధంగా పార్టీ వ్యవహారాల మీద దృష్టి పెట్టేందుకు రంగంలోకి దిగారు. పన్నీరు సెల్వం, నత్తం విశ్వనాథన్, వైద్యలింగం,  ఎడపాడి పళని స్వామి, ఎస్‌పి వేలుమణి, తంగమణిలతో కూడిన బృందం ఉదయాన్నే రాయపేటలోని అన్నాడీఎంకే రాష్ట్ర కార్యాలయంలో అడుగు పెట్టింది. వీరి రాకతో పార్టీలో నెలకొన్న గందరగోళ పరిస్థితులకు తెర పడ్డట్టు అయింది. కార్యాలయంలోకి వచ్చిన ఆరుగుర్ని అక్కడి పార్టీ వర్గాలు ఆహ్వానించారు. తదుపరి మొదటి అంతస్తుకు చేరుకున్న ఈ బృందం ఎన్నికల వ్యవహారాల మీద పూర్తి దృష్టిని సారించాయి. అన్నాడీఎంకేకు మద్దతు తెలిపేందుకు వచ్చిన వివిధ సంఘాల, సంస్థల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఇది వరకు జయలలితతో పోయెస్ గార్డెన్‌లో కలిసి మద్దతు తెలిపిన కొన్ని పార్టీల నాయకులతో సీట్ల పందేరాల చర్చలతో ఈ బృందం మునగడం విశేషం. ఇన్నాళ్లు వస్తున్న ఆరోపణలు, విమర్శలు, ప్రచార, పుకార్లుతో కూడిన  కథనాలకు వీరి రాక చెక్ పెట్టినట్టు అయింది.

 పన్నీరు ప్రత్యక్షం దృష్టి పెట్టేందుకు రంగంలోకి దిగారు. పన్నీరు సెల్వం, నత్తం విశ్వనాథన్, వైద్యలింగం,  ఎడపాడి పళని స్వామి, ఎస్‌పి వేలుమణి, తంగమణిలతో కూడిన బృందం ఉదయాన్నే రాయపేటలోని అన్నాడీఎంకే రాష్ట్ర కార్యాలయంలో అడుగు పెట్టింది. వీరి రాకతో పార్టీలో నెలకొన్న గందరగోళ పరిస్థితులకు తెర పడ్డట్టు అయింది. కార్యాలయంలోకి వచ్చిన ఆరుగుర్ని అక్కడి పార్టీ వర్గాలు ఆహ్వానించారు. తదుపరి మొదటి అంతస్తుకు చేరుకున్న ఈ బృందం ఎన్నికల వ్యవహారాల మీద పూర్తి దృష్టిని సారించాయి. అన్నాడీఎంకేకు మద్దతు తెలిపేందుకు వచ్చిన వివిధ సంఘాల, సంస్థల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఇది వరకు జయలలితతో పోయెస్ గార్డెన్‌లో కలిసి మద్దతు తెలిపిన కొన్ని పార్టీల నాయకులతో సీట్ల పందేరాల చర్చలతో ఈ బృందం మునగడం విశేషం. ఇన్నాళ్లు వస్తున్న ఆరోపణలు, విమర్శలు, ప్రచార, పుకార్లుతో కూడిన  కథనాలకు వీరి రాక చెక్ పెట్టినట్టు అయింది.

మరిన్ని వార్తలు