విద్యార్థులకు ఫ్రీ వై-ఫై!

5 May, 2016 19:00 IST|Sakshi

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గురువారం తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. మే 16 న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలను ఆకర్షించే పలు పధకాలను ఈ మేనిఫెస్టోలో ఏఐఏడీఎంకే పొందుపరచింది.

మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలు..
► ఇంటికో ఉద్యోగం
► రూ. 10 లక్షల వరకు గృహరుణాలు
► ఉద్యోగం చేస్తున్న మహిళలకు స్కూటీల కొనుగోలుకు 50 శాతం సబ్సిడీ
► 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
► అమ్మ బ్యాంకింగ్స్ కార్డు
► రేషన్ కార్డు ఉన్న ప్రతి గృహానికి ఉచిత మొబైల్
► విద్యార్థులకు ఫ్రీ వై-ఫై
►గర్భిణీ స్త్రీలకు ఇచ్చే మొత్తం 12 వేల నుంచి 18 వేలకు పెంపు
► రైతులకు రుణమాఫీ
► సంక్రాంతికి రూ. 500 గిఫ్ట్
► ప్రతి ఇంటికి ఉచిత సెటప్ బాక్స్
► అన్ని బస్ స్టేషన్లు, వాణిజ్య సముదాయాల్లో ఉచిత వై-ఫైవయోవృద్ధులకు ఉచిత బస్సు ప్రయాణం అన్ని జిల్లాలకు విస్తరణ
► పెళ్లి సమయంలో ఇచ్చే బంగారం 4 గ్రాముల నుంచి 8 గ్రాములకు పెంపు
► పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం టిఫిన్
► లోకాయుక్త ఏర్పాటు
► మహిళల ప్రసూతి సెలవు 9 నెలలకు పెంపు
 

మరిన్ని వార్తలు