జయంరవి, లక్ష్మీమీనన్‌ల మిరుదన్

5 Sep, 2015 02:55 IST|Sakshi
జయంరవి, లక్ష్మీమీనన్‌ల మిరుదన్

 నటుడు జయంరవి, లక్ష్మీమీనన్ జంటగా నటిస్తున్న చిత్రానికి మిరుదన్ అనే పేరును ఖరారు చేశారు.రోమియోజూలియట్, తనీఒరువన్ వంటి విజయవంతమైన చిత్రాల తరువాత జయంరవి తదుపరి చిత్రానికి సిద్ధం అయ్యారు.  తాజాగా నిర్మాత మైఖెల్ రాయప్పన్ తన గ్లోబల్ ఇన్ఫోటెయిన్‌మెంట్ పతాకంపై నిర్మిస్తున్న భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఇంతకు ముందు నాడోడిగళ్, గోరియపాలైయం, పట్టత్తు యానై హిట్ చిత్రాలను నిర్మించిన మైఖెల్ రాయప్పన్ నటుడు అధర్వ హీరోగా ఈటీ చిత్రాన్ని రూపొందించారు.
 
 ఇది త్వరలో తెరపైకి రానుంది. ప్రస్తుతం ఈయన నాణయం, నాయ్‌గళ్ జాగ్రత్తైవంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలకు దర్శకత్వం వహించిన శక్తి సౌందర్‌రాజన్ దర్శకత్వంలో జయంరవి కథానాయకుడుగా మిరుదన్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో నటి లక్ష్మీమీనన్ తొలిసారిగా జయంరవితో జతకడుతున్నారు. చిత్ర వివరాలను నిర్మాత వెల్లడిస్తూ చిత్ర షూటింగ్ ఇప్పటికే 30 శాతం పూర్తి అయ్యిందని చెప్పారు. తదుపరి షెడ్యూల్‌ను ఈ నెల 18 నుంచి మొదలెట్టనున్నట్లు తెలిపారు. డి.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఇందులో ఎన్నై అరిందాల్ చిత్రం ఫేమ్ బేబీ అనీగ, శీమాన్, కాళీ వెంకట్, ఆర్‌ఎన్‌ఆర్.మనోహర్ సాటై రవి,క్రేన్‌మనోహర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారని నిర్మాత చెప్పారు.
 

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు