శిరసా వహిస్తాం

28 Dec, 2014 02:03 IST|Sakshi

సుప్రీం తీర్పు మేరకు కార్యాలయాన్ని అప్పగించేందుకు మేం సిద్ధం
జేడీఎస్ జాతీయాధ్యక్షుడు దేవెగౌడ


బెంగళూరు : సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి బెంగళూరులోని జేడీఎస్ ప్రధాన కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీకు అప్పగించనున్నామని జేడీఎస్ పార్టీ జాతీయాధ్యక్షుడు దేవెగౌడ స్పష్టం చేశారు. పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన న్యూ ఇయర్ డైరీ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. కార్యాలయాన్ని నమ్ముకుని తాను పార్టీని స్థాపించలేదన్నారు. కార్యకర్తల నుంచి విరాళాలు సేకరించి నూతన కార్యాలయాన్ని నిర్మించగలనని దేవెగౌడ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘జేడీఎస్ రాజకీయ పార్టీ. రాజకీయ కార్యకలాపాల కోసం కార్యలయ స్థాపనకు సరైన చోట స్థలాన్ని కేటాయించండి.

పూర్తి స్థాయి కార్యాలయాన్ని నిర్మించేంత వరకూ లీజు ప్రతిపాదికన ఓ కట్టడాన్ని కేటాయించండి’ అని బీడీఏకు లేఖ రాసినా అధికారులు స్పందించడం లేదన్నారు. దీని వెనుక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హస్తముందని ఆరోపించారు. జేడీఎస్‌ను రూపుమాపాలని ఆయన భావిస్తున్నారని, అయితే అది ఎన్నటికీ జరగదని దేవెగౌడ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
 

మరిన్ని వార్తలు