విక్రమ్‌తో తొలిసారి

19 Mar, 2015 00:34 IST|Sakshi
విక్రమ్‌తో తొలిసారి

 విక్రమ్‌తో నటించడం సంతోషాన్ని కలిగిస్తోందని నటి కాజల్ అగర్వాల్ తెలిపారు. కాజల్ అగర్వాల్ ఇదివరకే విజయ్, సూర్య, కార్తి, ధనుష్‌తో నటించారు. ఇంతవరకు విక్రమ్‌తో నటించలేదు. ప్రస్తుతం తొలిసారిగా విక్రమ్‌కు జంటగా నటించేందుకు అంగీకరించారు. పలువురి హీరోయిన్ల పోటీ మధ్య ఈ అవకాశం కాజల్‌కు దక్కింది. దీని గురించి కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ విక్రమ్‌తో నటించనుండడం సంతోషాన్ని కలిగిస్తోందన్నారు.

విక్రమ్ అంటే చాలా ఇష్టమని, అతని నటన ఎంతో నచ్చుతుందన్నారు. విక్రమ్ ప్రతిభాశీలి, కష్టపడి పనేచేసే త త్వం కలవారన్నారు. ఆయనతో కలిసి నటించేందుకు ఆసక్తితో ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రం కథ, తన పాత్ర అద్భుతంగా వుందన్నారు. ఈ చిత్రంలో మరో కథానాయకిగా ప్రియా ఆనంద్ నటిస్తున్నారని తెలిపారు. కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ధనుష్‌కు జంటగా మారి చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ముగిసి రిలీజ్ కు సిద్ధమవుతోంది. తమిళం, తెలుగు భాషల్లో రూపొందే చిత్రంలోనూ విశాల్‌కు జంటగా నటిస్తున్నారు. రెండు హిందీ చిత్రాలు కైవశంలో వున్నాయి.
 

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు