ఉలగ నాయగన్ పేరుతో ‘యూ ట్యూబ్ చానల్’

23 Nov, 2014 02:51 IST|Sakshi
ఉలగ నాయగన్ పేరుతో ‘యూ ట్యూబ్ చానల్’

 నటుడు కమల్ హాసన్‌ను ఉలగ నాయగన్ (విశ్వ నాయకుడు) అని ఆయన అభిమానులు పిలుచుకుంటారు. అదే పేరుతో ఆయనిప్పుడు యు ట్యూబ్ చానల్ ప్రారంభించారు. ప్రముఖ హాలీవుడ్ నిర్మాత పెరి ఓస్పోన్ కోరిక మేరకు కమల్ యు ట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించడం విశేషం. దిలాడ్స్ ఆఫ్ ది రింగ్స్ చిత్ర నిర్మాత పెరి ఓస్పోన్ కమల్‌హాసన్ గురించి మాట్లాడుతూ సినిమా, సాహిత్యం చిత్ర నిర్మాణం, దర్శకత్వం అంటూ పలు విభాగాల్లో నిష్ణాతుడైన కమల్ హాసన్ ఆయన ప్రతిభాపాటవాలను, అనుభవాలను ఇతరులు తెలుసుకునే విధంగా ఒక చానల్‌ను ప్రారంభిస్తే బాగుంటుందనే కోరికను వెలిబుచ్చారట.

 ఆయన ఆకాంక్ష మేరకు కమల్ ఉలగనాయకన్ యు ట్యూబ్ పేరుతో ఇంటర్నెట్‌లో ఒక యు ట్యూబ్ చానల్‌ను ప్రారంభించారు. యూట్యూబ్‌లో 2500 మంది చందాదారులుగాను, 75వేల మంది వీక్షకులుగాను చేరడం విశేషం. ది విలాక్ (విడియోలాక్) కెవాయ్ మొళి అనే బ్లాక్‌లో కమల్ హాసన్ తన అభిప్రాయాలను, అనుభవాలకు పొందుపరుస్తుంటారు. తన కవితలను, సాహిత్యానికి చెందిన విశేషాలను పొందుపరుస్తున్నారు. అభిమానుల ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇస్తుంటారు.
 

మరిన్ని వార్తలు