వర్శిటీలో 3 వేల కండోమ్లు కనుగొన్నారు

8 Nov, 2016 09:43 IST|Sakshi
వర్శిటీలో 3 వేల కండోమ్లు కనుగొన్నారు

న్యూఢిల్లీ: ఢిల్లీ జేఎన్యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ మరోసారి వర్శిటీ అధికారులు, బీజేపీ నేతలపై విమర్శలు ఎక్కుపెట్టాడు. విద్యార్థి నజీబ్ అహ్మద్ అదృశ్యమై చాలా రోజులు కావస్తున్నా అతని ఆచూకీ కనుకోలేదని విమర్శించాడు. అయితే జేఎన్యూలో ఎన్ని కండోమ్లు ఉన్నాయో తెలుసుకోగలిగారంటూ ఎద్దేవా చేశాడు. దేశద్రోహం కేసులో అరెస్టయి జైలుకెళ్లి వచ్చిన కన్హయ్య ‘ఫ్రమ్‌ బిహార్ టు తిహార్’ అనే పుస్తకాన్ని రాశాడు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కన్హయ్య వర్శిటీ అధికారులు, బీజేపీ నేతల తీరును ఎండగట్టాడు.

‘జేఎన్యూలో రోజుకు 3 వేల బీర్లు, 2 వేల మద్యం బాటిళ్లు, 10 వేల సిగరెట్లు, 4 వేల బీడీలు, 50 వేల లెగ్‌ పీసులు, 2 వేల చిప్స్ పాకెట్లు, 3 వేల కండోమ్లు, 500 అబార్షన్ ఇంజెక్షన్లు వాడుతారు’ అంటూ బీజేపీ ఎమ్మెల్యే జ్ఞాన్దేవ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను కన్హయ్య ప్రస్తావించాడు. అక్టోబర్ 14న వర్శిటీ హాస్టల్లో జరిగిన గొడవ తర్వాత నజీబ్ అహ్మద్ అదృశ్యమయ్యాడని, అధికారులు ఇప్పటి వరకూ ఆచూకీ తెలుసుకోలేకపోయారని విమర్శించాడు. నజీబ్‌ అదృశ్య ఘటనపై విద్యార్థులు నిరసన తెలియజేశారు.
 

మరిన్ని వార్తలు