నేటి నుంచి కాణిపాకం బ్రహ్మోత్సవాలు

5 Sep, 2016 10:02 IST|Sakshi
కాణిపాక ఆలయం
–21 రోజుల పాటూ ప్రత్యేక కార్యక్రమాలు
కాణిపాకం : చిత్తూరు జిల్లా కాణిపాక వరసిద్ది వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి 21 రోజుల పాటూ వైభవంగా జరుగనున్నాయి. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ జరుగుతున్నాయి. భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

 5న వినాయక చవితి, 6న హంసవాహనం,7న నెమలి వాహనం, 8న మూషిక వాహనం, 9న శేష వాహనం, 10న వృషభ వాహనం, 11న గజవాహనం, 12న రథోత్సవం, 13న అశ్వవాహనం,14న ధ్వజ అవరోహణం,15న అధికార నంది వాహనం,16న రావణబ్రహ్మ వాహనం,17న యాళి వాహనం, 18న సూర్య ప్రభ వాహనము, 19న చంద్రప్రభ వాహనము, 20న కామధేను వాహనం, 21న పూలంగి సేవ, 22న కల్పవృక్ష వాహనం, 23న విమానోత్సవం,24న పుష్పపల్లకి సేవ, 25న తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. ఉత్సవాలు జరిగే రోజులలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. నిత్యం భారీగా భక్తులు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను ముమ్మరం చేసినట్లు ఈఓ పూర్ణచంద్రారావు తెలిపారు.
>
మరిన్ని వార్తలు