వివాదంలో బిగ్‌బాస్‌ నివేదిత

1 Aug, 2018 11:42 IST|Sakshi
డ్యాన్స్‌ చేస్తున్న నివేదిత గౌడ

యశవంతపుర :  ఇప్పటికే పలు రాష్ట్రాలలో నిషేధించిన కికీ (రోడ్డుపై డ్యాన్స్‌ చేయటం) చాలెంజ్‌ను ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్టు చేసిన కన్నడ బిగ్‌బాస్‌ పారిసిపేట్‌ నివేదిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నివేదిత ఇటీవల కారులో వెళ్తూ ఒక ట్రాఫిక్‌ ప్రాంతంలో దిగి డ్యాన్స్‌ చేసి ఆ వీడియోను ఇన్‌స్ట్రాగామ్‌లో అప్‌లోడ్‌ చేసి కికీ చాలెంజ్‌కు పిలుపునిచ్చారు. ఈ కికీ చాలెంజ్‌ను పలు రాష్ట్రాలు నిషేధించాయి. భారీ ట్రాఫిక్‌ ఉన్న ప్రాంతంలో ఉన్నట్టుండి కారు దిగి డ్యాన్‌ చేయటాన్ని కికీ చాలెంజ్‌గా పిలుస్తారు. బిగ్‌బాస్‌లో పాల్గొన్న నివేదిత గౌడ నగరంలోని రోడ్డుపై కారు దిగి 15 సెకండ్ల పాటు డ్యాన్స్‌ చేసి అది అప్‌లోడ్‌ చేశారు. నడి రోడ్డుపై ఇలా డ్యాన్స్‌ చేయటం వల్ల ట్రాఫిక్‌ సమస్యతో పాటు ప్రమాదాలు కూడా జరుగతాయని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలో కూడా కికీ చాలెంజ్‌ను నిషేధించాలని కన్నడిగులు కోరుతున్నారు.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు