టీవీ నటి కిరాతకం

30 May, 2017 15:26 IST|Sakshi
టీవీ నటి కిరాతకం

బెంగళూరు : టీవీ సీరియళ్లకు ఏమాత్రం తీసిపోని కథ ఇది. బుల్లితెరపై నటిస్తున్న ఒక మహిళ సీరియళ్లలోని కుట్రలనే ఒంటబట్టించుకుంది. సహచరునితో అక్రమ సంబంధం పెట్టుకుని, ఆనందానికి అడ్డుగా ఉన్నాడని భర్తను పరలోకాలకు పంపించింది. ఆ మహిళను, ఆమె ప్రియుడిని నిన్న యశ్వంతపుర పోలీసులు అరెస్ట్‌ చేశారు.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. హతుడు తుమకూరు నగరానికి చెందిన సతీష్‌ (36). అతని భార్య, టీవీ నటి కల్పన (27), ప్రియుడు జావేద్‌ను అరెస్టు చేశారు. సతీష నగరంలో ఒక ప్రైవేట్‌ సెక్యూరిటీ ఏజెన్సీలో సూపర్‌వైజర్‌. భార్య కల్పన, ఇద్దరు పిల్లలతో కలిసి యశ్వంతపురలోని సుబేదార్‌ పాళ్యలో నివాసం ఉంటున్నారు. కొంతకాలంగా కల్పన కన్నడ సీరియల్స్‌లో నటిస్తోంది. అక్కడే పరిచయమైన జావేద్‌తో అక్రమ సంబంధం కొనసాగుతోంది. దీనిపై సతీష్‌ ఆమెను పలుమార్లు మందలించాడు.

దాంతో ప్రియుడితో కలిసి భర్తను అడ్డు తొలగించుకోవాలనుకుంది. 25వ తేదిన రాత్రి భోజనంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. తిన్న వెంటనే సతీష్‌ మత్తులో పడిపోయాడు. ప్రియుడు జావేద్‌ను పిలిపించి ఇద్దరూ కలిసి సతీష్‌ను సుత్తితో తలపైన కొట్టిచంపారు. తన భర్తను ఎవరో వచ్చి హత్య చేశారని విలపించింది. పోలీసులు అనుమానంతో కల్పనను అదుపులోకి తీసుకుని విచారించగా, సోమవారం అసలు విషయం బయట పెట్టింది. దాంతో పోలీసుల ఈ జంటకు బేడీలు తగిలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు