‘ముఖ్యమంత్రి బండారం బయటపెడతా’

31 May, 2017 15:45 IST|Sakshi
‘ముఖ్యమంత్రి బండారం బయటపెడతా’

న్యూఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్యే, మాజీమంత్రి కపిల్‌ మిశ్రాకు బుధవారం ఢిల్లీ అసెంబ్లీలో చేదు అనుభవం ఎదురైంది. ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌లో ఆరోపణలు చేసినందుకు ఆప్‌ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కపిల్‌ మిశ్రాపై దాడి చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. పరిస్థితి అదుపు తప్పడంతో కపిల్‌ మిశ్రాను మార్షల్స్‌ బలవంతంగా సభనుంచి బయటకు తీసుకువెళ్లారు.

అనంతరం కపిల్‌ మిశ్రా మాట్లాడుతూ ఆప్‌ గుండాలు తనపై దాడికి యత్నించారని, కేజ్రీవాల్‌ బెదిరింపులకు తాను భయపడేది లేదన్నారు. కేజ్రీవాల్‌ బండారం మొత్తం బయటపెడతానని ఆయన వ్యాఖ్యానించారు. సభలో తనకు మాట్లాడేందుకు అవకాశం కూడా ఇవ్వలేదన్నారు. దీనిపై తాను మాట్లాడుతుండగానే ఆప్‌ ఎమ్మెల్యేలు దూసుకు వచ్చి, దాడి చేయడమే కాకుండా, పిడిగుద్దులు గుద్దారన్నారు.

తనపై దాడి చేస్తున్న సమయంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ నవ్వుతున్నారని, అలాగే డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా ఆప్‌ ఎమ్మెల్యేలకు డైరెక్షన్‌ ఇస్తున్నారని కపిల్‌ మిశ్రా ఆరోపించారు. కాగా గత నెలలో కూడా ఆప్‌ మద్దతుదారులు కపిల్‌ మిశ్రాపై దాడికి యత్నించారు.

ఒకప్పుడు  కేజ్రీవాల్‌కు విశ్వాసపాత్రుడుగా ఉన్న కపిల్‌ మిశ్రా... ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ రూ.2 కోట్లు ఇస్తుండగా తాను చూశానని, మందుల కొనుగోలు విషయంలోనూ ఆరోగ్య శాఖ కుంభకోణానికి పాల్పడిందని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆస్పత్రిలో నటి కుష్బూ

చెట్టెక్కి మామిడి కాయలు కోసిన గాలి

కూల్‌డ్రింగ్‌ తాగబోయి ...

నటుడు నాజర్‌పై ఆరోపణలు

వారం రోజుల్లో అనేక రాజకీయ పరిణామాలు

కాలేజీ బ్యాగ్‌లో కోటి రూపాయలు 

చెవి కత్తిరించిన రౌడీ షీటర్‌ అరెస్ట్‌

చెత్తకుప్పలో రూ.5 కోట్ల మరకతలింగం

శోభక్కా, గాజులు పంపించు: శివకుమార్‌

సిద్ధూ వర్సెస్‌ కుమారస్వామి

ఎయిర్‌హోస్టెస్‌ చెవి కట్‌ చేశాడు..

క్యాప్సికం కాసులవర్షం

పతంజలి పేరు వాడొద్దని నోటీసులు

తుపాను బాధితులకు ఇల్లు కట్టించిన లారెన్స్‌

మా నీళ్లను దొంగలించారు సారూ!

నీళ్లు లేవు, పెళ్లి వాయిదా

విశాల్‌ మంచివాడు కాదని తెలిసిపోయింది

స్కేటింగ్‌ చిన్నారి ఘనత

స్టాలిన్‌తో కేసీఆర్‌ సమావేశం

టిక్‌టాక్‌ అంటున్న యువత

పెళ్లి కావడం లేదు.. కారుణ్య మరణానికి అనుమతివ్వండి

జలపాతాలు, కొండలతో కమనీయ దృశ్యాలు

హైటెక్‌ సెల్వమ్మ

వీడియో కాన్ఫరెన్స్‌కు ఓకే!

మైసూరులో దారుణం, యువతిపై గ్యాంగ్‌ రేప్‌

అతడు నేనే.. రోజూ మెట్రోలో వెళ్లి వస్తుంటా..

బట్టల గోడౌన్‌లో అగ్నిప్రమాదం, ఐదుగురు మృతి

మధురై ప్రభుత్వ ఆస్పత్రిలో విషాద ఘటన

చీకట్లో రోషిణి

కార్తీ మరో రూ. 10 కోట్లు కట్టి వెళ్లండి..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హాలీవుడ్‌ మళ్లీ పిలిచింది

పెళ్లి వద్దు... పిల్లలు కావాలి

లెక్కలు చెప్పేదాన్ని!

మెంటల్‌ రైడ్‌

బుద్ధిమంతుడు

అమెరికాలో సైలెంట్‌గా...