రాబోయే 15 రోజుల్లో కేసులు రెట్టింపు కావొచ్చు

12 Jul, 2020 17:21 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో రాబోయే 15 నుంచి 30 రోజుల్లో కరోనా కేసులు రెట్టింపు కావొచ్చని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి శ్రీరాములు పేర్కొన్నారు. ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతాలో.. రాబోయే రెండు నెలలు కరోనాకు అడ్డుకట్టవేయడం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారుతుంది. అయితే ప్రజలు ఎటువంటి భయాందోళలకు గురికావాల్సిన పనిలేదు. సవాళ్లను అధిగమించడానికి అందుకు సంబంధించిన అన్ని రకాల చర్యలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తున్నట్లు మంత్రి శ్రీరాములు పేర్కొన్నారు.

మనమంతా సురక్షితంగా ఉండటానికి కోవిడ్‌-19కు నిబంధనలను తప్పకుండా పాటించాలని ఆయన ట్విటర్‌ ద్వారా కోరారు.  కాగా.. శనివారం నాటికి రాష్ట్రంలో కోవిడ్‌-19 కేసుల సంఖ్య 36,216కు చేరుకుంది. మరణాల సంఖ్య 613గా ఉంది. గత కొద్దిరోజులుగా కరోనా మహమ్మారి బీభత్సం సృష్టిస్తున్న కారణంగా బెంగళూరు నగరంతో పాటు, రూరల్‌ జిల్లాల్లో ఈ నెల 14 నుంచి 22వ వరకు పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ను విధిస్తున్నట్లు ఈ సందర్భంగా మంత్రి శ్రీరాములు తెలిపారు. (గుర్రాలు తెంచుకున్నాకే మనం మేల్కొంటామా!)

>
మరిన్ని వార్తలు