తప్పుకుంటా!

28 Dec, 2013 03:05 IST|Sakshi
తప్పుకుంటా!

 గవర్నర్ భరద్వాజ్ వైరాగ్యం..
*సీఎం, మంత్రులు  విలువ ఇవ్వడం లేదు
* సలహాలకే  పరిమితం చేస్తున్నారు
 * గత బీజేపీ పాలనతో ప్రజలు విసిగిపోయారు
 * నేడు కాంగ్రెస్ పాలనపై కూడా అంతే
 * ఎమ్మెల్యేల విదేశీ పర్యటన అర్థరహితం
 * రాష్ర్టంలోనే అధ్యయనం చేయవచ్చు

 
 మైసూరు, న్యూస్‌లైన్ : ‘ముఖ్యమంత్రి, మంత్రులే గవర్నర్ మాట వినడం లేదు. నా సలహాలు వారికి మాత్రమే పరిమితం. ఎమ్మెల్యేలు విదేశీ పర్యటనకు వెళ్లడం వారి వ్యక్తిగత విషయం. ఇందులో నేను జోక్యం చేసుకోను. అయితే ఎమ్మెల్యేలు వారి నియోజక వర్గాల అభివృద్ధి, ప్రాధాన్యతలపై అధ్యయనం జరపాల్సిన అవసరం ఉంది. నా మాట వినని సీఎం, మంత్రుల గురించి నేనేమీ మాట్లాడను. గవర్నర్ పదవి నుంచి తప్పుకోవాలనుకుంటున్నా’ అని రాష్ట్ర గవర్నర్ హెచ్‌ఆర్. భరదాజ్ వైరాగ్యంతో కూడిన వ్యాఖ్యలు చేశారు.

నగరంలో శుక్రవారం ఓ సమ్మేళనంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎవరూ ఎవరి మాటా వినడం లేదన్నారు. కనుక గవర్నర్ పదవి నుంచి వైదొలగాలని యోచిస్తున్నానని అన్నారు. గత బీజేపీ పాలనతో విసిగిపోయిన ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టారని తెలిపారు. అయితే కాంగ్రెస్ పాలనపై కూడా అనేక ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ఎమ్మెల్యేలు అధ్యయనాలు జరపడానికి రాష్ట్రంలోనే చాలా ప్రదేశాలున్నాయని, కనుక వారు విదేశీ పర్యటనలకు వెళ్లడంలో అర్థం లేదని ఆయన చురకలు అంటించారు.
 

మరిన్ని వార్తలు