నిఖిల్‌ పెళ్లిపై నివేదిక  ఇవ్వండి

1 May, 2020 12:45 IST|Sakshi

కర్ణాటక ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

సాక్షి, బెంగళూరు: మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి తనయుడు నిఖిల్‌ వివాహ వేడుకపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. లాక్‌డౌన్‌ సమయంలో నిఖిల్‌ వివాహం  (ఏప్రిల్‌ 17) సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించినట్లు విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దీనిపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు అయింది. పెళ్లి కోసం ఎన్ని వాహనాలకు పాస్‌లు ఇచ్చారు. ఎంతమంది అతిథులు పాల్గొన్నారు. భౌతిక దూరం పాటించారా లేదా అనేది తెలపాలంటూ గత నెల 21నాటికి నివేదిక ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చినా... ప్రభుత్వం ఇంతవరకూ సమాధానం ఇవ్వలేదు. పెళ్లికి ఇచ్చిన పాస్‌లను దుర్వినియోగం చేశారని పిటిషనర్‌ ఆరోపించడంతో... దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో మే 5లోపు నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. (ఇదేం పెళ్లి తంతు.. ఇప్పుడు అవసరమా!)

మరోవైపు లాక్‌డౌన్‌ నిబంధనలను గాలికి వదిలి మాజీ ఎమ్మెల్యే కొడుకు పెళ్లి వైభవంగా జరిగింది. చిత్రదుర్గ జిల్లా హొసదుర్గ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ నాయకుడు బీజీ గోవిందప్ప తనయుని వివాహం బేలూరులో జరిపారు. ఈ వేడుకకు పెద్దసంఖ్యలో అతిథులు రావడం, కనీస దూరం, మాస్కులు లేకుండా హాజరు అయ్యారు. దీంతో ప్రజలకు ఒక చట్టం, పెద్దలకు మరో చట్టమా? అని సోషల్‌ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. (నిఖిల్ పెళ్లి సింపుల్గా జరిగింది: యడియూరప్ప)

మరిన్ని వార్తలు