ప్రకాశ్‌రాజ్‌కు పోలీసుల నోటీసు

8 Sep, 2018 11:22 IST|Sakshi

కర్ణాటక, యశవంతపుర : హిందువులను అవహేళనంగా మాట్లాడిన బహుభాష నటుడు ప్రకాశ్‌రాజ్‌కు బెంగళూరు పోలీసులు విచారణ నోటీస్‌ను జారీ చేశారు. న్యాయవాది ఎన్‌.కిరణ్‌ బెంగరూరు 24వ ఎసీఎంఎం కోర్డు ఆదేశాల మేరకు హనుమంతనగర పోలీసులు ప్రకాశ్‌రాజ్‌పై కేసు నమోదు చేశారు. దీంతో తమ ముందు హజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. విజయపురలో జరిగిన సమావేశంలో గోమాత గురించి ఏమి తెలియదు. బట్టలు సుభ్రం కావాలంటే ఒక కేజీ పేడ, రెండు లీటర్ల గోమూత్రంతో బట్టలను శుభ్రం చేసుకోవాలని అవహేళనగా మాట్లాడారు.  హిందువుల మనోభావాలను రెచ్చకొట్టిన ప్రకాశ్‌రాజ్‌పై చర్యలు తీసుకోనేలా పోలీసులను అదేశించాలంటూ   రెండు నెలల క్రితం న్యాయవాది కిరణ్‌కేసు దాఖలు చేశారు. దీంతో ప్రకాశ్‌రాజ్‌కు పోలీసులు నోటీసును జారీ చేశారు.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు