డ్రోన్ల ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసిన కర్ణాటక

9 May, 2016 21:17 IST|Sakshi

బెంగళూరు: కర్ణాటక హోంశాఖలో డ్రోన్ (అన్‌మాన్డ్ ఏరియల్ వెహికల్ - యూఏఈ) దళం ఏర్పాటైంది. మొత్తం 20 మంది సిబ్బంది కలిగిన ఈ విభాగం వివిధ రకాల నిఘా విషయాలపై దృష్టి సారించనుంది. ఓ రాష్ట్ర పోలీసు శాఖలో డ్రోన్ దళం ఏర్పాటు కావడం దేశంలో ఇదే మొదటిసారి.
దక్షిణ కొరియా నుంచి ఒక్కొక్కటి రూ.1.50 లక్షల చొప్పున మొత్తం 12 డ్రోన్లను కర్ణాటక కొనుగోలు చేసింది. 18.5 మెగాపిక్సల్స్ సామర్ధ్యం కలిగిన ఫాంటం మోడల్ కు చెందిన ఈ డ్రోన్లు రాత్రుళ్లు కూడా ఫోటో, వీడియోలను చిత్రించగలవు. ప్రస్తుతం వీటిని రాష్ట్రంలోని ఇసుక అక్రమ రవాణా, తవ్వకాలు, గనుల తవ్వకాలపై నిఘా ఉంచడానికి వినియోగిస్తున్నారు. రాష్ట్ర అదనపు డీజీపీ మాట్లాడుతూ.. డ్రోన్ వినియోగంపై ఇప్పటివరకు 20 మంది సిబ్బందికి శిక్షణనిచ్చినట్లు తెలిపారు. వీరు కొప్పళ్, యాదగిరి, బళ్లారి, బీదర్, రాయచూర్, కల్బుర్గి జిల్లాల్లో విధులు నిర్వస్తున్నట్లు వివరించారు.

>
మరిన్ని వార్తలు