నేటి నుంచి కాశీ–గన్నవరం విమాన సర్వీసు

19 Feb, 2017 03:53 IST|Sakshi
నేటి నుంచి కాశీ–గన్నవరం విమాన సర్వీసు

విమానాశ్రయం (గన్నవరం): ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసి (కాశీ) నుంచి గన్నవరానికి స్పైస్‌జెట్‌ ఆదివారం కొత్త సర్వీస్‌ ప్రారంభించనుంది. ఈ విమానం మంగళవారం మినహా  అన్ని రోజులూ  రాకపోకలు చేయనుంది. 180 సీటింగ్‌ ఉన్న  ఈ విమానం వారణాసి నుంచి రోజూ ఉదయం 10.00కి బయల్దేరి మధ్యాహ్నం 12.10 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటుంది.

తిరిగి హైదరాబాద్‌ నుంచి మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి 1.50కి గన్నవరం చేరుకుంటుంది. తిరిగి ఇక్కడి నుంచి మధ్యాహ్నం 2.40కి బయలుదేరి హైదరాబాద్‌ మీదుగా సాయంత్రం 6.55కు కాశీ చేరుకుంటుంది.

మరిన్ని వార్తలు