నోట్ల రద్దుపై మోదీతో కేసీఆర్‌ ఏమన్నారంటే..

19 Nov, 2016 17:15 IST|Sakshi
నోట్ల రద్దుపై మోదీతో కేసీఆర్‌ ఏమన్నారంటే..

ఢిల్లీ: పెద్దనోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ రాష్ట్ర ఆదాయంపై తీవ్ర ప్రభావం పడిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు. శనివారం ఢిల్లీలో ప్రధానితో భేటీ అయిన కేసీఆర్‌.. పెద్దనోట్ల రద్దు పరిణామాలపై చర్చించారు. నోట్ల రద్దు మూలంగా సామాన్యులు, రైతులు, వ్యాపారులు, ఉద్యోగులు, అన్ని వృత్తులవారు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని కేసీఆర్‌ ప్రధానిని కోరారు.