కోలీవుడ్‌పై కీర్తి కన్ను

13 Aug, 2014 23:53 IST|Sakshi
కోలీవుడ్‌పై కీర్తి కన్ను

కోలీవుడ్‌లో పాగావేస్తే చాలు ఆ తరువాత సౌత్‌నే ఏలవచ్చు. ఆపై బాలీవుడ్ దృష్టిలో పడవచ్చు. ఇది నేటి మాలీవుడ్ హీరోయిన్ల లెక్క. నటి ఆసిన్ లాంటి ముద్దుగుమ్మలు ఇలానే బాలీవుడ్‌స్థాయికి ఎగబాకారు. ప్రస్తుతం కోలీవుడ్‌ను ఏలుతున్న నయనతార నుంచి యువ నటి లక్ష్మీమీనన్ వరకు మాలీవుడ్‌లో కెరీర్‌ను ప్రారంభించి కోలీవుడ్‌లో రాణిస్తున్నవారే. ఇప్పుడీ లిస్టులో కొత్తగా కీర్తి సురేష్ చేరడానికి ప్రయత్నిస్తోంది. ఈ బ్యూటీ సీనియర్ నటి నెట్రికన్ను చిత్ర హీరోయిన్ మేనక కూతురు. మలయాళంలో ఆల్‌రెడీ రంగప్రవేశం చేసేసింది. తొలి చిత్రం గీతాంజలి నిరాశ పరచింది. మలిచిత్రం రింగ్‌మాస్టర్‌తో అక్కడ విజయఖాతాను ప్రారంభించింది.
 
 ఇప్పుడు కీర్తి కన్ను కోలీవుడ్‌పై పడింది. దర్శకుడు విజయ్ సైవం వంటి సక్సెస్‌ఫుల్ చిత్రం తరువాత తాజాగా యువ నటుడు విక్రమ్‌ప్రభుతో మరో చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇది బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ కావడంతో అందమైన హీరోయిన్‌ను ముంబయి నుంచి దిగుమతి చేయాలని భావించారు. అందులో భాగంగా కొందరు ముంబయి భామల్ని పరిశీలిస్తున్న విజయ్ దృష్టి కేరళకుట్టి కీర్తిపై పడింది. అయితే ఈ బ్యూటీనే దర్శకుడిని అప్రోచ్ అయ్యారట. దీంతో ఈ అమ్మడినే (అమలాపాల్) ఇటీవల జీవిత భాగస్వామిని చేసుకున్న విజయ్ కీర్తిని తన చిత్రంలో హీరోయిన్‌చేసే పనిలో ఉన్నట్లు సమాచారం.
 
 అయితే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు గానీ బుధవారం కీర్తికి స్క్రీన్ టెస్ట్ చేశారు. ఈ టెస్ట్‌లో కీర్తి నెగ్గే అవకాశాలు మెండుగా ఉన్నాయని సమాచారం. ఈ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రం సెప్టెంబర్‌లో సెట్‌పైకి రానుందని తెలిసింది. అన్నట్లు కేరళకుట్టి కీర్తి టాలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. అక్కడ రెండు జళ్లసీత చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది.
 

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా