జాడలేని ముంగారు వానలు

19 Jun, 2014 02:06 IST|Sakshi
  • మలెనాడు రైతన్నల్లో కంగారు
  •  దుక్కిదున్ని దిక్కులు చూస్తున్న వైనం
  • శివమొగ్గ : ముంగారువానల జాడ కనిపించకపోవడంతో మలెనాడు రైతుల్లో కంగారు నెలకొంది. దుక్కిదున్ని ముంగారు వానల కోసం ఎదురు చూస్తున్నాడు. మరోవైపు జిల్లాలోని ప్రముఖ జలాశయాల్లో నీటి పరిమాణం యథాస్థితిలో కొనసాగుతోంది. జూన్ మధ్యలో జిల్లా వ్యాప్తంగా కుండపోత వానలు పడ్డాయి. అయితే ప్రస్తుతం తేలికపాటి జల్లులు మాత్రమే పడుతున్నాయి.

    గత 24 గంటల వ్యవధిలో జిల్లా వ్యాప్తంగా న మోదైన వర్షపాత వివరాలు... సొరబ తాలూకాలో 24 మి.మీ వర్షపాతం, శివమొగ్గలో 2.4 మిమీ, భద్రావతి 2.4, తీర్థహళ్లి 11.2, సాగర 3.4, శికారిపురలో 4 మి.మీ, హొసనగర 10 మి.మీ వర్షపాతం నమోదైంది. ప్రముఖ జలవిద్యుత్ ఉత్పాదన కేంద్రమైన లింగమనక్కి నీటి పరిమాణం 1,929 క్యూసెక్కులు ఉండగా అందులో 2,440 క్యూసెక్కుల నీటిని విద్యుత్ ఉత్పత్తికోసం విడుదల చేస్తున్నారు.

    జలాశయ నీటిమట్టం 1,744 అడుగులు ఉండగా గరిష్ట నీటిమట్టం 1,819 అడుగులు. శివమొగ్గ-దావణగెరె జిల్లా ప్రజల జీవనాడిగా పేరుపొందిన భద్రా జలాశయంలో నీటిమట్టం 2,137 క్యూసెక్కులు ఉండగా, అందులో 111 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయ పరిధిలో 1.66 మి.మీ వర్షపాతం నమోదైంది. జలాశయనీటివ ుట్టం 132.10 అడుగులు ఉండగా, జలాశయ గరిష్ట నీటిమట్టం 186 అడుగులు.

    శివమొగ్గ తాలూకా గాజనూరులోని తుంగా జలాశయంలో నీటి పరిమాణం 1,250 క్యూసెక్కులు ఉండగా ప్రస్తుతం డ్యాం నీటి పరిమాణం 587.30 అడుగులు కాగా జలాశయ గరిష్ట నీటిమట్టం 588.24 అడుగులు ఉంది. జిల్లాలో ఇతర డ్యాంలైన అంజనాపుర, అంబ్లిగోళ, వరాహి జలాశయాలు నీటి పరి మాణం తక్కువగా ఉండగా గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత ం ఈ జలాశయాల్లో నీటి పరిమాణ స్థాయి చాలా తక్కువగా ఉంది.

    జిల్లాలో అనుకున్నంత స్థాయిలో వర్షాలు పడకపోవడంతో రైతుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో రైతులు మొక్కజొన్న విత్తనం కూడా పూర్తి చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో  విత్తు పనుల్లో ఉన్నారు.  ముంగారువానల కోసం రైతుల వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
     

మరిన్ని వార్తలు