మల్లె ‘ప్రియం’

15 Jan, 2015 19:03 IST|Sakshi
మల్లె ‘ప్రియం’

చెన్నై: సంక్రాంతి వేళ మల్లె పువ్వు ప్రియంగా మారాయి. కిలో పువ్వులు రూ.2వేలు పలకడంతో వినియోగదారులు బెంబేలెత్తారు. ఇతర పువ్వుల ధరలకు సైతం రెక్కలు వచ్చాయి. పండుగంటే, ప్రధానంగా పూజాధి కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీ. పూజా వస్తువుల్లో పువ్వులు కీలకం. సంక్రాంతి పర్వ దినం కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి చెరకులు, పసుపు, అరటి గెలలు, పలు రకాల పండ్లు మార్కెట్లో కొలువు దీరినా, ధరలు ఆకాశాన్ని అంటా యి. పూజా సామగ్రి వస్తువుల ధరల మోత ఓ వైపు ఉంటే, మరో వైపు పువ్వుల ధరలకు రెక్కలు వచ్చాయి.

మదురై పరిసరాల్లో లభించే మదురై మల్లె, మద్రాసు మల్లెతోపాటుగా పలు ప్రాంతాల్లో ఉత్పత్తయ్యే మల్లె పువ్వు సంక్రాంతి పర్వ దినాన ప్రియంగా మారింది. నిన్న మొన్నటి వరకు రూ.800 నుంచి రూ. వెయ్యి వరకు పలికిన మల్లెపువ్వు ధర బుధవారం రూ.2 వేలకు చేరడం ప్రజల నెత్తిన భారం పడింది. మదురై మల్లె కిలో రూ.రెండు వేలు, మద్రాసు మల్లె రూ.1800 పలికింది.

ఇక మరికొన్ని ప్రాంతాల్లో ఉత్పత్తి అయ్యే మల్లె పువ్వుల ధర రూ.1500 వరకు పలకడం గమనార్హం. కనకాంబరం కిలో రూ. వెయ్యి పలికింది. రోజా, సంపంగి, చామంతి తదితర పువ్వుల ధరలకు సైతం రెక్కలు వచ్చాయి. ధరలు పెరిగానా, తమ స్తోమత మేరకు పువ్వులను పూజ కోసం కాస్తా కూస్తో కొనుగోలు చేసుకోక తప్పలేదు.

మరిన్ని వార్తలు