అసిన్‌ను వీడని ‘కిల్లాడి 786’ కేసు

29 Dec, 2014 02:09 IST|Sakshi
అసిన్‌ను వీడని ‘కిల్లాడి 786’ కేసు

 తమిళసినిమా: కోలీవుడ్, టాలీవుడ్‌లో వెలిగిన నటి అసిన్. ఈ క్రే జ్ ఈ మలయాళి బ్యూటీని బాలీవుడ్‌కు ఎగబాకేలా చేసింది. అయితే ఆ తరువాత దక్షిణాది అవకాశాలను అంగీకరించడానికి అమ్మడు చాలా బెట్టుకుపోయింది. ముఖ్యంగా పారితోషికం విషయంలోనే కొండెక్కి కూర్చొంది. ఆ విధంగా పలు అవకాశాలను కాలదన్నుకున్న అశిన్ ప్రస్తుతం రెండింటికీ చెడ్డ రేవడిగా మారిందంటున్నాయి సినీ వర్గాలు. బాలీవుడ్‌కు పరిచయమైన తొలి చిత్రం గజని ఘనవిజయం సాధించడంతో ఫ్యూచర్ చాలా బ్రైట్‌గా కనిపిం చింది భామకు. తదుపరి అవకాశాలు కూడా అలానే వరించాయి. అయితే విజయాలే ముఖం చాటేశాయి.
 
 ఫలితం ప్రస్తుతం అమ్మడి చేతిలో ఒకే ఒక్క చిత్రం ఉంది. దీంతో అసిన్ జాడ ఎక్కడని బాలీవుడ్ వెతుకుతున్న పరిస్థితి. ఎప్పుడో విడుదలై నిరాశపరచిన కిల్లాడి 786 చిత్రం తలనొప్పి మాత్రం ఈ ముద్దుగుమ్మను వెంటాడుతోంది. అసలు విషయం ఏమిటంటే 786 అనే సంఖ్యను ఇస్లాం మతస్తులు చాలా పవిత్రంగా భావిస్తారు. అలాంటి సంఖ్యను కిల్లాడి 786 చిత్రంలో తప్పుగా చూపించారట. దీంతో ఈ చిత్రంలో నటించిన హీరో అక్షయ్‌కుమార్, హీరోయిన్ అసిన్, దర్శక, నిర్మాతలపై తగిన చర్యలు తీసుకోవాలని నజీంబునో అనే వ్యక్తి ముంబయి కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ కేసు ముంబయిలోని అందేరి మెజిస్ట్రేట్ కోర్టులో విచారణకు వచ్చింది. కేసు విచారించిన మెజిస్ట్రేట్ అక్షయ్‌కుమార్, అసిన్, చిత్ర దర్శక నిర్మాతలని వెంటనే విచారించి ఫిబ్రవరి 11లోపు వివరాలను కోర్టుకు సమర్పించాలని పోలీసులను ఆదేశిం చారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.
 

మరిన్ని వార్తలు