ఎంపీ కుమారుల భూమి రిజిస్ట్రేషన్ రద్దు

1 Nov, 2016 08:58 IST|Sakshi
ఎంపీ కుమారుల భూమి రిజిస్ట్రేషన్ రద్దు
హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప భూ ఆక్రమణలపై జిల్లా కలెక్టర్ శశిధర్ స్పందించారు. రికార్డులు తారుమారు చేసిన బూదిలి గ్రామ వీఆర్ఓ నరసింహమూర్తిని సస్పెండ్ చేస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఎంపీ నిమ్మల కిష్టప్ప కుమారులు చేయించిన భూమి రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బాధితులకే భూములు అప్పగిస్తూ కలెక్టర్ శశిధర్ ఉత్తర్వులు ఇచ్చారు. (చదవండి - నిమ్మల భూ కిరికిరి)
 
బాధిత రైతు మల్లేశప్ప  జిల్లా కలెక్టర్, ఎస్పీని మీ కోసం కార్యక్రమంలో కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని విన్నవించుకున్నాడు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈనెల 18న స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో 2011లో భూమి కొనుగోలు చేసిన వ్యక్తులతో పాటు బాధిత రైతు మల్లేశప్ప తహశీల్దార్‌ ఎదుట హాజరై తన వాంగ్మూలంతో పాటు భూములకు సంబంధించిన పక్కా రికార్డులను సమర్పించారు.
మరిన్ని వార్తలు