ఈ - బడ్జెట్

1 Apr, 2015 01:29 IST|Sakshi

రాష్ట్రంలో తొలిసారిగా తుమకూరు పాలికెలో ప్రవేశపెట్టిన వైనం
ల్యాప్‌టాప్‌లో బడ్జెట్ వివరాలు పరిశీలించిన సభ్యులు
 

తుమకూరు : రాష్ట్రంలో తొలిసారిగా తుమకూరు నగరపాలికెలో ఈ-బడ్జెట్‌ను (కాగిత రహిత) ప్రవేశపెట్టారు. మంగళవారం ఉదయం పాలికెలో రూ. 2కోట్లు మిగులుతో ఈ బడ్జెట్‌ను పాలికె ఆర్థిక స్థాయీ సమితి అధ్యక్షుడు నగేష్ బావికట్టె ప్రవేశపెట్టారు. కాగిత రహితంగా ఉండడంతో ల్యాప్‌టాప్‌లో ఉన్న బడ్జెట్ అంశాలను ఆయన సభ్యులకు చదివి వినిపించారు. అదే సమయంలో సభ్యులు కూడా వారి వద్ద ఉన్న ల్యాప్‌టాప్‌లలో బడ్జెట్ అంశాలను పరిశీలించారు. ఈ తరహా బడ్జెట్‌నుప్రవేశపెట్టడంపై సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
 మంగళవారం ప్రవేశపెట్టిన తుమకూరు పాలికె 2015-16 బడ్జెట్‌లో నీటి సరఫరా, చెత్త సేకరణ, విభజన, రోడ్ల అభివృధ, యూజీడీ తదితర అభివృ్ధ పనులకు పెద్ద పీట వేశారు.  పాలికెకు పన్నుల రూపంలో ఆదాయం పెంచుకునేందుకు చర్యలు చేపట్టనున్నారు. నిరుపేదలకు, వసతి లేని వారికి నైట్ షెల్టర్స్‌ను ఏర్పాటు చేయడం కోసం రూ. 50 లక్షలను కేటాయించారు.

నగర పాలికె అభివృ్ధ కోసం ఆస్తి పన్ను, దుకాణాల సముదాయాలపైన అద్దె పెంచనున్నారు. పాలికెకు వచ్చే ఆదాయంలో పేదలకు, మురికివాడల్లో నివసించే వారికి మూలభూత సౌకర్యాలను కల్పించేందుకు కృష చేయనున్నారు. ఈ-బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంపై సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. అయితే ఈ తరహా బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు ముందస్తుగా సమాచారం ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. అలాగే ల్యాప్‌టాప్‌ల వినియోగం గురించి తెలియని పలువురు సభ్యులు తమకు ప్రత్యేకంగా శిక్షణను ఇప్పించాలని మేయర్ లలితారవీష్‌ను కోరారు. దీనిపై మేయర్ మాట్లాడుతూ.. పాలికెలో కాగిత రహిత బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం వలన స్టేషనరీ ఖర్చు తగ్గుతోందని అన్నారు. సమావేశంలో సభ్యులతో పాటు పాలికె కమిషనర్ హర్షద్ రసూల్ షరీఫ్, ఉప మేయర్ వెంకటేష్, నయాబ్, విపక్ష నేత సురేంద్ర  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు