టికెట్ దక్కేదెవరికో..బరిలో ఉండేదెవరో..?

28 Sep, 2014 22:05 IST|Sakshi

పింప్రి, న్యూస్‌లైన్ : అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయింది. పోటీలో నిలిచేది ఎవరో మరో రెండ్రోజుల్లో తేలనుంది. పుణే నగరంలో ఉన్న 8 అసెంబ్లీ నియోజక వర్గాల్లో 23 మంది కార్పొరేటర్లు ఈసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇంత మంది కార్పొరేటర్లు ఎమ్మెల్యే పదవి కోసం పోటీ చేయడం ఇదే మొదటిసారి. నగరంలోని 8 నియోజక వర్గాలల్లో 6 నియోజక వర్గాల్లో ఎన్సీపీ, అత్యధికంగా 6 గురు కార్పొరేటర్లకు సీట్లు కేటాయించింది. ఎమ్మెన్నెస్ కూడా 6 గురు కార్పొరేటర్లకు సీట్లు ఇచ్చింది. బీజేపీ -3, శివసేన-2, కాంగ్రెస్ ఒక్క కార్పొరేటర్‌కు అసెంబ్లీకి పోటీ చేసేందుకు అవకాశాలిచ్చాయి. ఆయా పార్టీల రెబల్ అభ్యర్థులుగా సీట్లు లభించని కార్పొరేటర్లు నామినేషన్లు వేశారు. వీరితోపాటు మరో ముగ్గురు మాజీ కార్పొరేటర్లు ఎన్నికల బరిలో పోటీకి సిద్ధమయ్యారు.
 
జిల్లాలో 561 నామినేషన్లు...
ఎవరికి ఏ పార్టీ టిక్కెట్ లభించిందో తెలియదు. పార్టీ ఎవరికి భి ఫారం ఇచ్చిందో తెలియదు. అసలైన పార్టీ అభ్యర్థులు ఎవరో తెలియ దు. అంతా గందరగోళంగా మారింది. చివరి రోజు శనివారం అంద రూ నామినేషన్లు వేశారు. ఆ తర్వాత అదృష్టం ఎవరిని వరించి వారికి టిక్కట్ దొరికితే వారే అభ్యర్థి కదా! అప్పటి వరకు చూద్దాం అనే ధోరణీ అన్ని రాజకీయ పార్టీల నాయకుల్లో నెలకొన్నది. మధ్య జిల్లాలో చివరి రోజూ 335 అభ్యర్థులు నామినేషన్లు వేశారు. గత 8 రోజుల్లో జిల్లాలోని 21 అసెంబ్లీ నియోజక వర్గాలకు  561 మంది నామినేషన్లు వేశారు. సోమవారం నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 1వ తే దీ నామినేషన్ల ఉపసంహరణతో బరిలో ఎవరు ఉండేది తెలుస్తోంది.
 
ఇందార్ నుంచి అత్యధికం
ఇందాపూర్ నుంచి అత్యధికంగా 45 మంది, పింప్రి నుంచి 40, శివాజీ నగర్-23, కోత్‌రోడ్-15, కసబా-24, పర్వతి-22, ఖడక్‌వాస్లా-32, పుణే కంటోన్మెంట్-23, హడప్సర్-20, వడగావ్‌శేరి-35, పింప్రి-40, చించ్‌వడ్-33, బోసిరి-35, మావల్-25, ఆంబేగావ్-16, జున్నర్-19, ఖేడ్ ఆలంది-30, శిరూర్-25, దౌండ్-25, పురంధర్-18, భోర్-23, బారామతి-24, ఇందాపూర్-45 నామినేషన్లు వేశారు.
 
ఊరేగింపుగా నామినేషన్ల దాఖలు
భివండీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు దాఖలు చేయడానికి శనివారం చివరిరోజు కావడంతో భివండీ మూడు విధాన సభ నియోజక వర్గాలలోని వివిధ పార్టీలకు చెందిన 52 మంది అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు  చేశారు. శనివారం నామినేషన్ల చివరి రోజు కావడంతో దాదాపు అన్నీ పార్టీల అభ్యర్ధులు కార్యకర్తలతో పాటు భాజా భజంత్రీలతో టపాకాయలు కాల్చు తూ ఊరేగింపుగా ప్రాంత్ కార్యాలయం, తహసిల్ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేశారు.
 
134-భివండీ రూరల్..
శివసేన పార్టీ తరఫున శాంతారామ్ మోరే, బీజేపీ అభ్యర్ధి డా. శాంతారమ్ పాటిల్, ఎమ్మెన్నెస్ అభ్యర్ధి దశరత్ పాటిల్, కాంగ్రెస్ అభ్యర్ధి సచిన్ శింగడా, బహుజన్ వికాస్ ఆగాడి అభ్యర్ధి రాజేష్ దుమాడా, నేషనల్ కాంగ్రెస్ (ఎన్సీపీ) అభ్యర్ధి మహదేవ్ గాతల్, బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్ధి తుకారమ్ మోరే,  స్వతంత్ర అభ్యరుధలు సంతోష్ జాద వ్, అనంతా దళ్వీ, వినోద్ చౌదరీ, విష్ణు పడ్వీ, లక్ష్మణ్ వాడు తదితర్లు నామినేషన్లు దాఖలు చేశారు.  
 
136-భివండీ తూర్పులో..
శివసేన-మనోజ్ కాటేకర్, బీజేపీ-మహేష్ చౌగులే, కాంగ్రెస్-సోహేహ్ (గుడ్డు) ఖాన్, ఎంఐఎం-జాకీ అబ్దుల్ షేక్, సమాజ్‌వాది-అబుదల్లా అన్సారీ, ఆర్పీ (సెక్యూలర్)-శీతల్ గాయిక్‌వాడ్, ఆర్పీఐ (ఎక్తావాది)-మహ్మద్ ఇష్క్ అష్‌ఫాక్, బహుజన్ సమాజ్ పార్టీ-జలాలుద్దీన్ అన్సారీ, స్వతంత్ర అభ్యర్ధులు హసాన్ నవీద్, రోహిణీ జాదవ్, కమలేష్ నాగు, ద్యానేష్వర్ భగత్, నురుద్దిన్ అన్సారీ నామినేషన్లు దాఖలు చేశారు.
 
137-భివండీ తూర్పు..
శివసేన-రుపేశ్ మాత్రే, బీజేపీ-సంతోష్ శెట్టి, కాంగ్రెస్-ఫాజిల్ అన్సారీ, నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)-ఖాలీద్ (గుడ్డు) షేక్, సీపీఐ-విజయ్ కాంబ్లే, బహుజన్ వికాస్ ఆగాడీ-తేజస్ పాటిల్, పీస్ పార్టీ-హబిబూర్ రైమాన్ ఖాన్, అవామీ వికాస్ పార్టీ-ఇర్‌ఫాన్ మోమిన్, ఎంఐ ఎం-అక్రమ్ ఖాన్, సమాజ్‌వాది-ఫారాన్ ఆజ్మీ, ఆర్పీ-ఆసీఎక్‌బాల్ మోమిన్, బహుజన్ సమాజ్ పార్టీ-అల్లా ఉద్దీన్ అన్సారీ, స్వతం త్ర అభ్యర్ధులుగా అబ్దుల్ జామాల్ ఉద్దీన్, తాండవ్ ముదిలి యార్, నూరుద్దీన్ అన్సారీ, అఫ్‌సా మస్కే, దినేష్ పాటిల్, వసుదేవ్ చౌదరి, శివాజీ శెడగే, ప్రతాప్ వంగ, దశరథ పాటిల్, సందీప్ పాటిల్‌లు నామినేషన్లు దాఖలు చేశారు.

>
మరిన్ని వార్తలు