మూజువాణి ఓటుతో అంగీకారం !

21 Apr, 2015 02:15 IST|Sakshi

- కర్ణాటక మున్సిపల్ యాక్ట్ సవరణల ముసాయిదాకు సభ ఆమోదం
- విపక్షాల ఆందోళనల మధ్యనే బిల్లుకు అంగీకారం
- ముసాయిదా బిల్లును చించేసి వ్యతిరేకతను తెలియజేసిన విపక్షాలు
సాక్షి, బెంగళూరు:
బీబీఎంపీని మూడు విభాగాలుగా విభజించేందుకు అనువుగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కర్ణాటక మున్సిపల్ యాక్ట్ సవరణల ముసాయిదా బిల్లుకు శాసనసభలో మూజువాణి ఓటుతో అంగీకారం లభించింది. విపక్షాల తీవ్ర ఆందోళనల మధ్యనే ముసాయిదా బిల్లుకు ఆమోదం లభించింది. దీంతో విపక్షాలు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర నిరసనను వ్యక్తం చేశాయి. ముసాయిదా బిల్లు ప్రతులను చించివేసిన బీజేపీ, జేడీఎస్ పార్టీల నేతలు స్పీకర్ పోడియంలోకి దూసుకెళ్లారు. దీంతో స్పీకర్ సభను వాయిదా వేయక తప్పలేదు.

అధికార, విపక్షాల మధ్య వాగ్యుద్ధం....
కర్ణాటక మున్సిపల్ యాక్ట్ సవరణల ముసాయిదా బిల్లు ఆమోదానికి గాను సోమవారం ఏర్పాటైన ప్రత్యేక శాసనసభ సమావేశం అధికార, విపక్షాల మధ్య వాగ్యుద్ధానికి వేదికైంది. కర్ణాటక మున్సిపల్ యాక్ట్ సవరణల ముసాయిదా బిల్లును ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తరఫున రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టి.బి.జయచంద్ర ఈ ముసాయిదా బిల్లును విధానసభలో ప్రవేశపెట్టారు.

బెంగళూరు అభివృద్ధి కోసమంటూ ప్రత్యేక చట్టాలేవీ ఇప్పటి వరకు లేవని టి.బి.జయచంద్ర పేర్కొన్నారు. అందుకే ఇప్పటికే ఎన్నోసార్లు హైకోర్టుతో రాష్ట్ర ప్రభుత్వానికి ‘అక్షింతలు’ కూడా పడ్డాయని, అంతేకాక అంతర్జాతీయ స్థాయిలో ‘చెత్త నగరం’గా బెంగళూరు నగరం అపఖ్యాతిని మూటగట్టుకుందని అన్నా రు. అందుకే ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం బీ.ఎస్ పాటిల్‌తో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిందని, ఈ కమిటీ ఇచ్చిన మధ్యం తర నివేదిక మేరకు బీబీఎంపీని విభజించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలి పారు.

పాలికె పునఃరచన జరిగే వరకు బీబీఎంపీ పరిధిలోని నియామకాలు, పథకాలు, పన్నుల వసూళ్లు, ఆస్తిహక్కు ఇవన్నీ రాష్ట్ర ప్ర భుత్వ ఆధీనంలోనే ఉంటాయని పేర్కొన్నారు. ప్రస్తుతం బీబీఎంపీలో ఉన్న ఉద్యోగులు, అధికారులు విభజన అనంతరం మహానగర పాలికెలో కొనసాగుతారని, ఇతర విషయా లు కొత్త పాలికె ఏర్పాటు అనంతరం చర్చించనున్నట్లు చెప్పారు. అయితే విపక్షాలు మాత్రం రాష్ట్ర ప్ర భుత్వ వైఖరిపై తీవ్రంగా మండిపడ్డాయి. కేవ లం తమ అధికార దాహం కోసమే బీబీఎంపీని విభజించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని విపక్షాలు మండిపడ్డాయి. ఈ సందర్భంగా జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి మాట్లాడుతూ.

కాంగ్రె స్ ప్రభుత్వం కేవలం తన ప్రయోజనాల కోసమే హడావుడిగా ఈ బిల్లును ప్రవేశపెట్టిందని విమర్శించారు. ‘అసలు బీబీఎంపీని ఎన్ని విభాగాలుగా విభజించాలనుకున్నారు? ఒక వేళ బీబీ ఎంపీని విభజిస్తే నగరంలోని చెత్త సమస్యను ఎవరికి అప్పగిస్తారు? డ్రెయినేజీ సమస్యను ఎవరు పరిష్కరిస్తారు?’ అని ప్రభుత్వాన్ని ప్ర శ్నించారు. బీబీఎంపీని విభజిస్తే భవిష్యత్తులో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వ స్తుందని పేర్కొన్నారు. కేవలం తమ ప్రభుత్వ పరిధిలోనే బెంగళూరు అభివృద్ధి జరిగిందని కుమారస్వామి తెలిపారు. అనంతరం బీజేపీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్.అశోక్ మాట్లాడుతూ....బెంగళూరు అఖండంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. బీబీఎంపీలో అవినీతి చో టు చేసుకొని ఉంటే ఈ విషయంపై విచారణ జరిపి, బాధ్యులను శిక్షిం చాలి తప్పితే బీబీఎంపీనే విభజించాలనడం ఎంత వరకు సమంజసమని అన్నారు. బీబీఎంపీ విభజనకు సంబంధించి ఏర్పాటు చేసిన బి.ఎస్.పాటిల్ నేతృత్వంలోని కమిటీ తుది నివేదికను ఇచ్చే వరకు ప్రభుత్వం వేచి చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. కాగా, సోమవారం రాత్రి విధానసభలో ఆమోదం పొందిన బిల్లు విధానపరిషత్‌కు చేరింది.ఇక బీబీఎంపీ విభజనకు సంబంధించిన ముసాయిదా బిల్లులోని ముఖ్యాంశాలు....
- మరోసారి బెంగళూరు మహానగర పాలికె ఏర్పాటు
- బృహత్ బెంగళూరులోని బృహత్ పదం రద్దు
- బీబీఎంపీని మూడు విభాగాలుగా చేసే ఉద్దేశం
- ప్రస్తుతం బీబీఎంపీలో ఉన్న 12 స్థాయీ సమితిలను రద్దు చేయడం, ఇంతకు ముందు బెంగళూరు మహానగర పాలికెలో ఉన్న విధంగా 4 సమితిల ఏర్పాటు
- విభజన పూర్తయ్యే వరకు పాలనాధికారి ఆధ్వర్యంలోనే బీబీఎంపీ కార్యక్రమాలు

మరిన్ని వార్తలు