చిట్టిబుర్రలకు ట్రాఫిక్‌ చిట్కాలు

1 Feb, 2018 08:50 IST|Sakshi

ప్రాథమిక విద్యలో పాఠ్యాంశంగా బెంగళూరు ట్రాఫిక్‌

2019–20 నుంచి అమలు

బెంగళూరు ట్రాఫిక్‌ అంటే అదొక పద్మవ్యూహమే. లక్షలాది వాహనాలు, మనుషులతో కిక్కిరిసిన రోడ్లు అమ్మో అనిపిస్తాయి. దీనికి వాహనదారుల్లో అవగాహన లేకపోవడమూ ఒక కారణమనాలి. చిన్నప్పటి నుంచే బాలల్లో ట్రాఫిక్‌ పై చైతన్యం కల్పించడం ఉత్తమమని భావించిన రవాణా, విద్యాశాఖలు ఆ దిశగా కదిలాయి.

జయనగర: సిలికాన్‌ సిటీలో ట్రాఫిక్‌ ని ర్వహణ అనే అంశాన్ని పాఠ్యాం శంలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. 2019–20 విద్యాసంవత్సరం నుంచి ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. బెంగళూరులో వాహన సంచారం– ట్రాఫి క్‌ సమస్య నిర్వహణ అనే విషయాన్ని పాఠ్యాంశంలో చేర్చడం పరిశీలించాలని రవాణాశాఖ ఇటీవల ప్రాథమికోన్నత విద్యాశాఖకు ప్రతిపాదన అందించింది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ దీనిపై లోతుగా ఆలోచిస్తోంది. కానీ ప్రస్తుత విద్యా సంవత్సరం పూర్తికాగా, నూతన విద్యాసంవత్సరం ప్రారంభదశలో ఉంది. అంతేగాక 2018–19 పాఠ్యపుస్తకాల ముద్రణకు ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించగా, ఈ దశలో నూతన విషయాన్ని పాఠ్యాంశంలో చేర్చడం సాధ్యం కాదు. దీంతో 2019–20 విద్యాసంవత్సరం నుంచి బెంగళూరు ట్రాఫిక్‌ అంశాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలని ప్రభుత్వం తీర్మానించింది. ఉద్యానగరం విస్తారంగా అభివృద్ధి చెందడంతో నగరంలో ప్రతి ఒక్కరూ కూడా ట్రాఫిక్‌ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్డు భద్రత గురించి విద్యార్థులను ఏవిధంగా జాగృతం చేయాలి అనే దాని పట్ల రవాణాశాఖ సలహాలు అందజేసింది. వాటికి అనుగుణంగా ఈ విషయాన్ని పాఠ్యపుస్తకాల్లో చేరుస్తున్నారు. 2019–20 నుంచి అందుబాట్లోకి వస్తుందని బుధవారం రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి తన్వీర్‌సేఠ్‌Š‡ తెలిపారు.

పాఠ్యాంశంలో చేర్చే విషయాలు....
రోడ్డు ట్రాఫిక్‌ సిగ్నల్స్, నియమాలు
ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘన, జరిమానా గురించి సమాచారం
వేగ నియంత్రణ, ఓవర్‌టేక్, పాదచారుల సురక్షత గురించి సమాచారం
రోడ్డు ప్రమాదం సంభవించే సమయంలో అత్యవసరంగా సంప్రదించే సంస్థల వివరాలు ఉంటాయి.  
ఈ పాఠ్యాంశాలను బోధించే ఉపాధ్యాయులను ఎంపికచేసి ఢిల్లీలో ఉన్నతస్థాయి శిక్షణ తరగతులకు పంపుతారు. అక్కడ మాస్టర్‌ శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఇక్కడకు వచ్చి ఇతర ఉపాధ్యాయులకు రోడ్డు భద్రత గురించి శిక్షణనందిస్తారు.

మరిన్ని వార్తలు