‘లోకల్’ కనీస చార్జీ రూ. 10

5 Jan, 2014 23:52 IST|Sakshi

సాక్షి, ముంబై: లోకల్ రైళ్ల కనీస చార్జీ త్వరలో రూ. 10 కానుంది. ముంబై అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ ప్రాజెక్ట్ (ఎంయూటీపీ) ప్రాజెక్టు కోసం ముంబై రైల్వే అభివృద్ధి సంస్థ (ఎంఆర్‌వీసీ) గతంలో ప్రపంచ బ్యాం కు నుంచి రెండు విడతలుగా రుణం తీసుకుంది. ఈ రుణాలను తిరిగి ప్రపంచ బ్యాంకుకు చెల్లించాల్సి ఉంటుందని, ఇందుకోసం కనీస చార్జీలను పెంచాలని నిర్ణయించామని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. కాగా ఎంఆర్‌వీసీ.. ప్రపంచ బ్యాంకు నుంచి మొదటి విడత కింద రూ.1,613 కోట్లు,  రెండోవిడత కింద రూ.1,910 కోట్ల రుణం తీసుకుంది.
 
 ఇటీవల సమావేశమైన రైల్వేబోర్డు కనీస చార్జీలను పెంచాలని నిర ్ణయించింది. కనీస చార్జీతోపాటు నెలసరి పాస్ చార్జీలుకూడా పెరుగుతాయని అధికారులు తెలిపారు. ఈ విషయమై సంబంధిత అధికారులు మాట్లాడుతూ తాము ప్రపంచబ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను తీర్చడానికి సంవత్సరానికి రూ.40 కోట్లు సం పాదించాల్సి వస్తుందన్నారు. దీంతో గత్యంతరం లేక చార్జీలను పెంచాల్సి వచ్చిందన్నారు. చార్జీలను పెంచితే రాబడి పెరుగుతుందని, తద్వారా ప్రపంచబ్యాంకు నుంచి తీసుకున్న రుణం తిరిగి చెల్లించడం సులభమవుతుందన్నారు. అయితే రైల్వే బోర్డు నిర్ణయంపై కొందరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని మరోసారి పరిశీలిస్తే బాగుంటుందంటూ భారత్ మర్చెంట్స్ చాంబర్ సభ్యులు... రైల్వేబోర్డుకు రాసిన లేఖలో పేర్కొన్నారు.  
 
 మా చేతుల్లోమీ ఏమీ లేదు
 రైల్వే బోర్డు సూచనల మేరకే తాము నడుచుకుంటుమని పశ్చిమ రైల్వే విభాగం పీఆర్‌వో శరత్ చంద్రాయన్ పేర్కొన్నారు. చార్జీలను పెంచడం, పెంచకపోవడం వారి చేతుల్లోనే ఉంటుం దన్నారు.

మరిన్ని వార్తలు