పొడవైన జడకు రూ. 15వేలు !

1 Oct, 2015 02:19 IST|Sakshi
పొడవైన జడకు రూ. 15వేలు !

గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలతో పాటు అక్కడి ప్రజల జీవన శైలిని బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో నివశిస్తున్న వారికి పరిచయం చేయడానికి వీలుగా ఈ నెల 3 నుంచి రెండు రోజుల పాటు బెంగళూరులోని ఫ్రీడమ్ పార్కులో ‘హళ్లి హబ్బ’ నిర్వహిస్తున్నట్లు విద్యారణ్య సంస్థ ప్రధాన కార్యదర్శి ఎం.సి.రమేష్ తెలిపారు. బుధవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో  ఆయన  మాట్లాడారు. హళ్లి హబ్బలో లగోరి, గోళీల ఆట వంటి గ్రామీణ క్రీడల్లో పోటీ ఉంటుందన్నారు. 

అంతేకాకుండా ఇందులో పాల్గొన్న వారిలో పొడవైన మీసాలు ఉన్న మగవారికి మొదటి బహుమతిగా రూ.15వేలు,  పొడవైన జడ ఉన్న మహిళలకు మొదటి బహుమతిగా రూ.15వేలుగా ఇవ్వనున్నామన్నారు. ఈ రెండు విభాగాల్లో కూడా రెండు, మూడో స్థానాల్లో నిలిచిన వారికి వరుసగా రూ.10వేలు, రూ.5 వేలు ఇవ్వనున్నట్లు  తెలిపారు. రెండు రోజుల పాటు ప్రతి రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు జరిగే హళ్లిహబ్బలో పాల్గొనడానికి ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదని రమేష్ తెలిపారు. - సాక్షి, బెంగళూరు
 

>
మరిన్ని వార్తలు