నుంచి సీఎం, పరమేశ్వర ప్రచారం

5 Aug, 2014 02:04 IST|Sakshi
  • బోరు బండ్ల యజమానులకు సీఎం హెచ్చరిక
  •   బోర్లు విఫలమైతే పూడ్చి వేసే బాధ్యత రిగ్ యజమానులదే
  •   ‘ఆర్కావతి’పై సీబీఐ దర్యాప్తు అవసరం లేదు
  • సాక్షి ప్రతినిధి, బెంగళూరు :  బాగలకోటె జిల్లా బాదామి తాలూకా సూలికేరి గ్రామంలో తిమ్మన్న హట్టి అనే ఆరేళ్ల బాలుడు బోరు బావిలో పడిపోయిన దుర్ఘటనలు పునరావృతం కాకుండా బోరు బండ్ల యజమానులపై కూడా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. గదగ్ పర్యటనకు వెళ్లడానికి ముందు సోమవారం హుబ్లీ విమానాశ్రయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

    ఇలాంటి సంఘటనలకు ఆయా భూముల యజమానులను మాత్రమే బాధ్యులను చేస్తున్నామని, ఇకమీదట బోరు బండ్ల యజమానులపై కూడా చర్యలు చేపడతామని తెలిపారు. బోర్లు విఫలమైన పక్షంలో ఆయా రిగ్గుల యజమానులు వెంటనే వాటిని పూడ్చి వేయాలని తెలిపారు. లేనట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
     
    ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్ నుంచి సమగ్ర నివేదికను కోరామని తెలిపారు. కాగా అర్కావతి లేఔట్
    డీనోటిఫికేషన్ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు అవసరం లేదని తేల్చి చెప్పారు. ఈ వ్యవహారంపై న్యాయ విచారణ చాలని అన్నారు. ఉభయ సభల్లో ప్రతిపక్ష నాయకులైన జగదీశ్ శెట్టర్, ఈశ్వరప్పలు తనపై లేని పోని ఆరోపణలు చేస్తున్నారని నిష్టూరమాడారు. వాస్తవాలను దాచి పెట్టి అసత్యాలను ప్రచారం చేసే పనిలో వారిద్దరూ నిమగ్నమయ్యారని ఎద్దేవా చేశారు. తప్పు చేయని వాడు దేనికీ భయపడడని, వాస్తవమేమిటనేది ఏదో ఒక రోజు తేలుతుందని ఆయన చెప్పారు.
     

మరిన్ని వార్తలు