బెంగళూరుని బెంబేలెత్తించిన భారీ శబ్ధాలు

20 May, 2020 17:23 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: భారీ పేలుడులాంటి శబ్ధం వినిపించడంతో నగర వాసులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. బుధవారం మధ్యాహ్నం 1 గంట 20 నిమిషాల సమయంలో సర్జాపూర్‌, వైట్‌ఫీల్డ్‌, హెబ్బాళ్‌, ఎంజీ రోడ్‌, మారతళ్లి, హెచ్‌ఎస్‌ఆర్‌ లే ఔట్‌ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఈ శబ్ధాలు వినిపించాయి. దీంతో భూకంపం సంభవించేదేమోనని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

దీనిపై కర్ణాటక రాష్ట్ర డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ సెంటర్ స్పందిస్తూ‌ ఈ శబ్ధాలు భూకంపం వల్ల వచ్చినవి కాదని తేల్చింది. రిక్టర్‌ స్కేలుపై ఎలాంటి ప్రకంపనలు రికార్డు కాలేదని కేఎస్‌ఎన్‌ఎండీసీ డైరెక్టర్‌ శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. శబ్ధాలపై హెచ్‌ఏఎల్‌, ఐఏఎఫ్‌లను సంప్రదించగా ఆ శ‌బ్ధాల‌కు త‌మ‌కు ఎటువంటి సంబంధం లేద‌ని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కూడా తేల్చి చెప్పింది. కాగా.. ఫ్లైట్లు లేదా సూపర్ సోనిక్ శబ్దాలేమోనని నిర్ధారించుకోవడం కోసం బెంగళూరు పోలీసులు ఎయిర్ ఫోర్స్ కంట్రోల్ రూంను సంప్రదించారు. వారి నుంచి సమాధానం రావాల్సి ఉందని పోలీసులు తెలిపారు. అయితే అంతలోనే దీనిపై కొందరు నెటిజన్లు రకరకాల వీడియోలను పోస్ట్‌ చేయడం గమనార్హం. చదవండి: గుర్రాల నుంచే కోవిడ్‌ వ్యాక్సిన్‌ 

మరిన్ని వార్తలు