బర్త్‌డేకు దళపతి దూరం

2 Mar, 2016 08:20 IST|Sakshi
బర్త్‌డేకు దళపతి దూరం

సాక్షి, చెన్నై: డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ మంగళవారం 64వ వసంతంలోకి అడుగు పెట్టారు. వరదల నేపథ్యంతో ఈసారి బర్త్‌డే వేడుకలకు దూరంగా స్టాలిన్ ఉన్నారు. అయితే, ఆయన బర్త్‌డేను యువజనోత్సవం పేరుతో సంక్షేమ పథకాల పంపిణీతో పార్టీ వర్గాలు నిరాడంబరంగా జరుపుకున్నాయి.
 
డీఎంకే అధినేత ఎం కరుణానిధి వారసుడిగా రాజకీయాల్లో దూసుకెళుతున్న ఎంకే స్టాలిన్ రానున్న ఎన్నికల ద్వారా అధికార పగ్గాలు లక్ష్యంగా పరుగులు తీస్తున్నారు.  పార్టీ బలోపేతం, అశేష అభిమాన లోకా న్ని, మద్దతు గణాన్ని కలుపుకుంటూ పయనాన్ని వేగవంతం చేశారు. కరుణానిధిని మళ్లీ సీఎం కుర్చీలో కూర్చొపెట్టాలన్న కాంక్షతో మనకు మనమే అంటూ ఓ మారు రాష్ట్రాన్ని చుట్టొచ్చారు. మరో మారు రాష్ట్రంలో పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో మంగళవారం 64వ  వసంతంలోకి స్టాలిన్ అడుగు పెట్టడం పా ర్టీ వర్గాలకు ఓ పండుగగా చెప్పవచ్చు. అం దరినోట దళపతిగా పిలవడే స్టాలిన్ బర్త్‌డేను వాడవాడల్లో ఘనంగా జరుపుకునేం దుకు డీఎండీకే వర్గాలు సిద్ధమయ్యాయి.
 
వరదల నేపథ్యంతో ఈ సారికి తన బర్త్‌డే వేడుకలు వద్దంటూ స్టాలిన్ ఇచ్చిన పిలుపుకు డీఎంకే వర్గాలు స్పందించాయి. ప్రతి ఏటా స్టాలిన్ బర్త్‌డేను యువజనోత్సవంగా జరుపుకుంటున్న దృష్ట్యా, ఆ యువజనోత్సవం పేరుతో సంక్షేమ పథకాలు సేవ కార్యక్రమాలతో ముందుకు సాగాయి. ఉచిత వైద్య శిబిరాలు, పేదలకు అవసరమయ్యే అన్ని రకాల వస్తువుల పంపిణీ, వంటి కార్యక్రమాలు నిర్వహించారు. వాడ వాడల్లో పార్టీ జెండాను ఎగురవేశారు. స్వీట్లు పంచిపెట్టారు.
 
 ఇక, చెన్నైలో అయితే, ఎమ్మెల్యే అన్భళగన్ నేతృత్వంలో తిరుమంగళం, అన్నానగర్, థౌజండ్ లైట్లలో సేవా కార్యక్రమాలు జరిగాయి. ఎగ్మూర్‌లో మాజీ ఎమ్మెల్యే శేఖర్ బాబు నేతృత్వంలో,  చేట్‌పట్‌లో మాజీ కేంద్ర మంత్రి దయానిధి మారన్ నేతృత్వంలో సంక్షేమ పథకాల పం పిణీ కార్యక్రమాలు జరిగాయి. ప్రతి ఏటా భారీ ఎత్తున వేడుకలు జరగడం, రాష్ట్రం నలుమూలలనుంచి పెద్ద సంఖ్యలో పార్టీ వర్గాలు తరలివ చ్చి స్టాలిన్‌ను కలుసుకోవడం జరిగేది. అయితే, ఈ సారి అలాంటి హం గు ఆర్భాటాల వేడుకలు కానరాలేదు. నిరాడంబరంగా సేవ కార్యక్రమాలతో యువజనోత్సవాన్ని డీఎంకే శ్రేణులు జరుపుకోవడం విశేషం.
 
 సూర్యుడి ఉదయం: తన జన్మదినానికి దూరంగా ఉన్న స్టాలిన్ పార్టీ వర్గాలకు సందేశం పంపించారు. అందరూ తన మీద కోపంతో ఉన్నారని పేర్కొన్నారు. బర్త్‌డే వేడుకలు వద్దని సూచించడం, మనకు ..మనమే పర్యటనకు రావద్దని తాను ఆదేశించడంపై పార్టీ వర్గాలు అసంతృప్తితో ఉన్నాయని వివరించారు.
 
అయితే, ఇవంతా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం మాత్రమేనని, హంగు ఆర్భాటాలతో కార్యక్రమాలు డీఎంకేకు వద్దు అన్న నిర్ణయంతో పయనం సాగుతున్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సైనికుల్లా పని చేసి పార్టీ గెలుపు లక్ష్యంగా, అధికార పీఠంపై అధినేత కరుణానిధిని ఆశీనులు చేయడం కర్తవ్యంగా పయనం సాగించాలని పిలుపు నిచ్చారు. అన్నాడీఎంకే అస్తమయం ఈ సారి ఖాయం అని, సూర్యుడు ఉదయించబోతున్నాడని, ఇందు కోసం ప్రతి ఒక్కరూ చెమటోడ్చి పని చేయాలని విన్నవించారు.

మరిన్ని వార్తలు