అమ్మవారి ఒడిలో హైకోర్టు తాళాలు

10 Dec, 2018 02:41 IST|Sakshi

24 గంటలు మద్రాసు హైకోర్టు గేట్లు మూసివేత

టి.నగర్‌(చెన్నై): మద్రాసు హైకోర్టు ఏడు ప్రవేశ ద్వారాలను శనివారం రాత్రి ఎనిమిది గంటల నుంచి ఆదివారం రాత్రి 8.00 గంటల వరకు మూసివేశారు. 150 ఏళ్ల చరిత్రగల మద్రాసు హైకోర్టు ప్రాంగణాన్ని అందరూ ఉపయోగించినప్పటికీ, ఎవరూ దానికి హక్కుదారు కాలేరు. కన్యకాపరమేశ్వరి ఆలయానికి చెందిన స్థలంలో హైకోర్టు నిర్మించినందున ఏడాదిలో ఒకరోజు హైకోర్టు అన్ని ద్వారాలు మూసివేసి తాళపు చెవులను ఆలయంలో ఉంచే సాంప్రదాయం కొనసాగుతోంది.

ఆమేరకు హైకోర్టు ఏడు ప్రవేశ ద్వారాలను శనివారం రాత్రి 8.00 గంటల నుంచి ఆదివారం రాత్రి 8.00 గంటల వరకు మూసివేస్తున్నట్టు హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్‌ రిజిస్ట్రార్‌ దేవనాథన్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. దీని నకలును అన్ని ప్రవేశ ద్వారాల్లోనూ అతికించారు. ఈ 24 గంటల సమయంలో హైకోర్టు ప్రాంగణంలోకి ప్రభుత్వ శాఖల వారు, న్యాయవాదులు, హైకోర్టు సిబ్బంది, ప్రజలు ఎవరినీ అనుమతించబోమని అందులో తెలిపారు. 

మరిన్ని వార్తలు