582 మంది డాక్టర్లు అదృశ్యం

5 Jan, 2017 12:24 IST|Sakshi

ముంబై: మహారాష్ట్రలో 582మంది ప్రభుత్వ వైద్యులు కనిపించడం లేదు. సంచలనం సృష్టిస్తున్న ఈ వార్త ప్రభుత్వాన్ని ఇరుకున పడేసింది. ఒకటి కాదు రెండు కాదు దాదాపు కొన్ని సంవత్సరాలు నుంచి ఈ డాక్టర్లు ఎక్కడున్నారో? ఏం చేస్తున్నారో కనీసం ప్రభుత్వం దగ్గర కూడా సమాచారం లేకుండా పోయింది. దీంతో ఆగమోఘాల మీద స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

అందరిపై వేటుకు సిద్ధం
విచారణలో ప్రభుత్వం దాదాపు 104 మంది వైద్యుల ఆచూకీ కనిపెట్టింది. కాగా, ఈ 582 మంది డాక్టర్లు ప్రభుత్వ వైద్యులుగా ఉంటూ రోగులకు ప్రభుత్వ ఆస్పత్రులలో వైద్యం చేయకుండా తిరుగుతున్నట్లు తెలిసింది. దీంతో ఈ 104 మందిపై ముందస్తు సూచనలు జారీ చేయకుండా విధుల నుంచి సస్పెండ్‌ చేసినట్లు ఆరోగ్య శాఖ మంత్రి దీపక్‌ సావంత్‌ వెల్లడించారు. మిగతా వైద్యుల ‘డాక్టర్‌ సర్టిఫికెట్‌’ రద్దు చేయాలని మెడికల్‌ కౌన్సిల్‌కు సిఫార్సు చేసినట్లు ఆయన చెప్పారు.


అర్ధంతరంగా వదిలేస్తున్నారు.
రాష్ట్రంలో  వెనబడిన ప్రాంతాల్లో వైద్య సేవలందించేందుకు ప్రభుత్వం వైద్యులను నియమిస్తుంది.  వైద్యుల్లో అక్కడి వాతారణం నచ్చక కొందరు సేవలను అర్థంతరంగా వదిలేసి వెళ్లిపోతారు. ఇలా 10 ఏళ్లలో 581 మంది వైద్యులు పత్తాలేకుండా పోయారు. సేవల్లో చేరిన తరువాత ఎలాంటి కారణాలు చెప్పకుండా ఉద్యోగాన్ని వదిలేసి వెళ్లడం, రాజీనామ చేయక పోవడం, ప్రభుత్వం అనుమతి తీసుకోకుండా సొంత ప్రాక్టీసు పెట్టుకోవడం లాంటి కృత్యాలకు పాల్పడే వైద్యులను ప్రభుత్వం వారు పారిపోయినట్లు ప్రకటిస్తుంది.  ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు జరపకుండా తప్పుకున్న వైద్యాధికారులపై చర్యలు తీసుకోవాలంటే సామాన్య పరిపాలన విభాగం అనుమతి తీసుకోవల్సి ఉంటుంది. ఈ విభాగం నుంచి అనుమతి లభించిన తరువాత దోషులైన వైద్యాధికారులపై సస్పెండ్‌ వేటు వేస్తారు.

477మందిపై చర్యలు: సావంత్‌

దోషులని తేలితే మిగతా 477 మంది వైద్యాధికారులపై చర్యలు తీసుకుంటామని  ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సావంత్‌ స్పష్టం చేశారు. ఇలా అర్థంతరంగా సేవలను వదిలేసి వెళ్లిన తరువాత ఖాళీ అయిన ఆ స్థానాల్లో ప్రభుత్వం పర్మినెంట్‌ పదవులను భర్తీ చేయాలనే నియమాలు లేవని తెలిపారు. దీంతో వెంటనే తాత్కాలిక పదవులు భర్తీ చేయడం వల్ల వైద్య సేవలపై ఎలాంటి ప్రభావం చూపడం లేదని సావంత్‌ అన్నారు.

మరిన్ని వార్తలు