పాక్‌ నటి ప్రచారంపై ఠాక్రేకు షారుక్‌ హామీ

13 Dec, 2016 03:16 IST|Sakshi
పాక్‌ నటి ప్రచారంపై ఠాక్రేకు షారుక్‌ హామీ

ముంబై: తన తాజా చిత్రం ‘రయీస్‌’ ప్రచార కార్యక్రమాల్లో పాకిస్తాన్‌ నటి మహీరా ఖాన్‌ పాల్గొనబోదని  బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారుక్‌ఖాన్‌ మహారాష్ట్ర నవ్‌నిర్మాణ్‌ సేన(ఎంఎన్‌ఎస్‌) చీఫ్‌ రాజ్‌ ఠాక్రేకు హామీ ఇచ్చారు. ఠాక్రేతో భేటీ సందర్భంగా ఈ హామీ ఇచ్చారని ఎంఎన్‌ఎస్‌ చిత్రపథ్‌ కర్మచారి సేన చీఫ్‌ అమీ ఖోప్కర్‌ సోమవారం చెప్పారు. రయీస్‌ ప్రదర్శనను తాము అడ్డుకోబోమని, ఈ సినిమాలో పాలుపంచుకున్న పాక్‌ నటులెవరూ ఇక్కడ ఉండరని అన్నారు. రయీస్‌ సినిమాలో మహీరా నటించారు.

>
మరిన్ని వార్తలు