రాజ్యాధికార సాధనకు సిద్ధం కావాలి

14 May, 2016 02:34 IST|Sakshi

మాల మహానాడు
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ వర్గీకరణ జరిగితే కేవలం విద్య, ఉద్యోగాల్లోనే రిజర్వేషన్లు వర్తిస్తాయని, కాలం చెల్లిన ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పక్కనపెట్టి ఎస్సీలంతా ఐక్యంగా రాజ్యాధికార సాధనకు సిద్ధం కావాలని మాల మహానాడు కోరింది. ఎస్సీ వర్గీకరణ వద్దంటూ మాల మహానాడు ఢిల్లీలో రిలే దీక్షలు చేపట్టింది. మాల మహానాడు అధ్యక్షుడు జి.చెన్నయ్య శుక్రవారం దీక్షలో మాట్లాడుతూ గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును, జాతీయ ఎస్సీ కమిషన్ చేసిన సిఫారసులను అమలుచేయాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ సులువైన అంశం కాదని, దీనికి దేశంలో సగం రాష్ట్రాల ఆమోదం కావాలని పేర్కొన్నారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ కల్పన, జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ల పెంపు, రాజ్యాధికార సాధన దిశగా మాల మహానాడుతో కలసి ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ దీక్షలో జింగి శ్రీను, భాస్కర్, విజయ్‌కుమార్ పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు